iDreamPost

వికేంద్రీక‌ర‌ణ‌పై మేధావుల గ‌ళ‌మేంటి..?

వికేంద్రీక‌ర‌ణ‌పై మేధావుల గ‌ళ‌మేంటి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల అంశంపై మేధావులు నెమ్మ‌దిగా స్పందిస్తున్నారు. వైసీపీ అధినేత రాష్ట్ర అభివృద్ది విష‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై త‌మ‌దైన శైలిలో గ‌ళం వినిపిస్తున్నారు.

క‌ర్నూలు, క‌డ‌ప, అనంత‌పురం, తిరుప‌తి న‌గ‌రాల్లో రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌, రాష్ట్రంలో అభివృద్ధి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై మేధావుల ఫోరం, యువ‌జ‌న సంఘాలు త‌మ గొంతక‌ను ఏక‌ధాటిగా వినిపించాయి. తిరుప‌తిలో ప‌ద్మావ‌తి విశ్వ‌విద్యాల‌యంలో రాయ‌ల‌సీమ‌ మేధావుల ఫోరం నేతృత్వంలో జ‌రిగిన స‌ద‌స్సులో ఫోరం కో ఆర్డినేట‌ర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెస‌ర్లు, ఉమామ‌హేశ్వ‌రి, క‌ళావ‌తి, విద్యార్థులు మాట్లాడారు. అమ‌రావ‌తిలో రాజ‌ధాని కొన‌సాగితే మిగ‌తా ప్రాంతాలు అభివృద్ధి చెంద‌వ‌న్న అభిప్రాయాం వీరిలో వ్య‌క్త‌మైంది. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల భ‌విష్య‌త్తులో రాయ‌ల‌సీమ‌లో వ‌ల‌స‌లు క‌నిపించ‌వ‌నిన్నారు.

సీమ‌లో కీల‌క‌మైన ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఇక వ‌ల‌స‌ల గురించి ఎవ్వ‌రూ ఆలోచించ‌రు. ఇన్నాళ్లూ ఇత‌ర ప్రాంతాల‌కు పొట్ట‌చేత‌ప‌ట్టుకొని వెళ్తున్న క‌రువు ప్రాంత వాసులకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు నిజంగా ఊపిరిపోసిన‌ట్లే. ఇక అనంత‌పురం జేఎన్‌టియులో జ‌రిగిన స‌ద‌స్సులో ఎస్కేయూ మాజీ రిజిస్ట్రార్ పిడ‌బ్య్లూ పురుషోత్తం, ఎస్కీయూ అసోసియేట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ర‌ఘునాథ‌రెడ్డిలు మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయ‌డం వ‌ల్ల ప్రాంతీయ‌వాదం మొల‌కెత్తే అవ‌కాశం ఉంద‌న్నారు. తాజాగా రాయ‌ల‌సీమ నేత‌లు ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ అంటూ చేస్తున్న కామెంట్ల‌కు చెక్ పెట్టాలంటే ప్ర‌భుత్వం తీసుకుంటున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌య‌మే స‌రైంద‌ని చెప్పొచ్చు.

బార్ కౌన్సిల్ ఇండియా స‌భ్యులు ఆలూరి రామిరెడ్డి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. గతంలో సీమ‌లో హైకోర్టు పెట్టాల‌ని 90 రోజులు దీక్ష‌లు చేస్తే చంద్ర‌బాబు అప‌హాస్యం చేశార‌ని మండ‌పడ్డారు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌ను అంద‌రూ స్వాగ‌తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇక క‌ర్నూలు, క‌డ‌ప‌లో కూడా ఇదే త‌ర‌హాలో స‌ద‌స్సులు జ‌రిగాయి. రాయ‌ల‌సీమ యూనివ‌ర్శిటీ ప‌రీక్ష‌ల విభాగం డీన్ ప్రొఫెస‌ర్ ఎన్‌టికే నాయ‌క్ మాట్లాడుతూ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వీరితో పాటు వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయ‌కులు సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల క‌లిగే లాభాల‌ను వివ‌రిస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాయ‌ల‌సీమ తీవ్రంగా నష్ట‌పోయిందన్నారు. కేవ‌లం అమ‌రావ‌తి పేరుతో హ‌డావిడి చేశార‌ని మండిప‌డ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి