iDreamPost

మహేష్ ఒప్పుకోవడానికి కారణాలు

మహేష్ ఒప్పుకోవడానికి కారణాలు

ఆచార్యకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య మంచి డిబేటబుల్ టాపిక్ అయ్యింది. నిజానికిది సడన్ గా తీసుకున్న నిర్ణయం. కథలో ఉన్న ధర్మస్థలిని పరిచయం చేసే సన్నివేశాలు ప్లస్ రెండు మూడు సీన్లకు మాత్రమే ప్రిన్స్ గొంతు ఉంటుంది. అంతే తప్ప సినిమా పొడవునా కాదు. సర్కారు వారి పాట పనుల్లో బిజీగా ఉన్నా కూడా దీనికి ఎందుకు ఒప్పుకున్నాడనే డౌట్ రావడం సహజం. దానికి కారణాలు ఉన్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడిగా కొరటాల శివ మీద మహేష్ కు చాలా అభిమానం ఉంది. అది పలు సందర్భాల్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బయట చెప్పారు కూడా.

ఇప్పుడు ఆయనే స్వయంగా ఆగడటంతో నో ఎందుకు చెప్తారు. పైగా మెగాస్టార్ మూవీ. తన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అడగ్గానే గెస్ట్ గా వచ్చారు. పోటీలో మేనల్లుడి అల వైకుంఠపురములో ఉందని తెలిసినా కూడా అవేవి ఆలోచించలేదు. పైగా మహేష్ చాలా సార్లు మెగాస్టార్ మీద అభిమానాన్ని, ఆయనే చివరి నెంబర్ వన్ అనే వాస్తవాన్ని చెప్పడం అందరికీ గుర్తే. దానికి తోడు చరణ్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ ఇక ఆలోచించడానికి అవకాశం ఇస్తుందా. మహేష్ గతంలో పవన్ కళ్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ బాద్షాలకు వాయిస్ ఓవర్ చెప్పారు. అవి మరీ ఇండస్ట్రీ హిట్స్ అనిపించుకోలేదు కానీ ఆ టైంకి తగ్గట్టు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి.

కాకపోతే తన కుటుంబసభ్యుల కోసం గాత్రం ఇచ్చిన కృష్ణ గారి శ్రీశ్రీ, మంజుల తీసిన మనసుకు నచ్చింది రెండూ డిజాస్టర్ అయ్యాయి. ఆచార్యకు ఇప్పుడిది అమాంతం బజ్ పెంచేయదు కానీ ఇన్ సైడ్ టాక్ అయితే ఇంటర్వల్ బ్లాక్ నుంచి క్లైమాక్స్ దాకా కొరటాల శివ బ్రాండ్ మేకింగ్ కన్నా చిరు స్టైల్ హీరోయిజం ఓ రేంజ్ లో పండిందట. ముఖ్యంగా రామ్ చరణ్ తో కాంబో ఎపిసోడ్స్ కి పూర్తి పైసా వసూల్ అంటున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఆచార్యలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు. చాలా కాలం తర్వాత సోనూ సూద్ తెలుగు సినిమాలో కంప్లీట్ సీరియస్ విలన్ గా చేశారు. అల్లుడు అదుర్స్ లో కామెడీ టచ్ ఎక్కువగా ఉంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి