iDreamPost

ఈ పాస్ వర్డ్స్ ని సెకనులోనే హ్యాక్ చేస్తారు.. మీ పాస్ వర్డ్ ఎంత స్ట్రాంగ్?

Change These Weak Passwords Immediately: పాస్ వర్డ్ అనేది ఇంటికి తాళం లాంటిది. మీరు వీక్ పాస్ వర్డ్ పెడితే మీ డేాటా, డబ్బు అన్నీ పోతాయి. ఎలాంటి పాస్ వర్డ్స్ ని తేలిగ్గా హ్యాక్ చేస్తారో చూడండి.

Change These Weak Passwords Immediately: పాస్ వర్డ్ అనేది ఇంటికి తాళం లాంటిది. మీరు వీక్ పాస్ వర్డ్ పెడితే మీ డేాటా, డబ్బు అన్నీ పోతాయి. ఎలాంటి పాస్ వర్డ్స్ ని తేలిగ్గా హ్యాక్ చేస్తారో చూడండి.

ఈ పాస్ వర్డ్స్ ని సెకనులోనే హ్యాక్ చేస్తారు.. మీ పాస్ వర్డ్ ఎంత స్ట్రాంగ్?

ప్రస్తుతం మన జీవితం చాలా వరకు డిజిటలైజ్ అయిపోయింది. మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం దాదాపు సోషల్ మీడియాలోనే ఉంటోంది. ఇంక నగదు, మనీ ట్రాన్సక్షన్స్ గురించి చెప్పనక్కర్లేదు. అలాగే మీ ఫొటోలు, సెన్సిటివ్ సమాచారం కూడా ఇప్పుడు మెయిల్, డ్రైవ్ అంటూ డిజిటల్ అయిపోయాయి. ఇలాంటి తరుణంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు ఇంటికి తాళం ఎలాగో.. యాప్స్ కి పాస్ వర్డ్ ఉంటుంది. అయితే ఇంటికి నాసిరకం తాళం వేస్తే దొంగలు ఎలా అయితే తేలిగ్గా దొంగతనం చేస్తారో.. కొన్ని రకాల వీక్ పాస్ వర్డ్స్ పెడితే మీ సమాచారాన్ని కూడా అలాగే దోచేస్తారు.

ఇంటికి తాళం ఎంత అవసరమో.. మీ బ్యాంకు అకౌంట్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, మెయిల్, డ్రైవ్ అన్నింటికి ఒక స్ట్రాంగ్ పాస్ వర్డ్ ఎంతో అవసరం. మీరు పెట్టే పాస్ వర్డ్ మీదే మీ డేటా అంతా ఆధారపడి ఉంటుంది. మీరు వీక్ పాస్ వర్డ్ ని ఎంపిక చేసుకుంటే మీ అకౌంట్ ని హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు ఒక్కోసారి సెకను కూడా పట్టదు. రెప్పపాటులో మీ అకౌంట్స్ ని హ్యాక్ చేసి మీ డేటా, నగదు మొత్తం దోచేస్తారు. చాలా మందికి అసలు ఈ పాస్ వర్డ్ ప్రాధాన్యత, ఎలా పెట్టాలి అనే విషయాలు కూడా తెలియదు. అయితే 2023లో ఎలాంటి తరహా పాస్ వర్డ్స్ వాడుతున్నారు అనే అంశంపై  నార్డ్ పాస్ సంస్థ ఒక నివేదికను వెల్లడించింది. అందులో ఎలాంటి పాస్ వర్డ్స్ ప్రజలు వాడుతున్నారు.. అలాంటి పాస్ వర్డ్స్ ని హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు ఎంత సమయం పడుతోంది అనే అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా వీక్ పాస్ వర్డ్స్ స్థానంలో ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ ని పెట్టుకోవాలో కూడా వాళ్లు సూచించారు.

password hacking

చాలామంది తాము పెట్టేది స్ట్రాంగ్ పాస్ వర్డ్ అనుకుంటారు. కానీ, వాళ్లు పెట్టే పాస్ వర్డ్ ని హ్యాక్ చేయడానికి 1 సెకను సమయం చాలు అంటున్నారు. అలాంటి వాటిలో admin, qwenty, password, Aa123456, P@ssw0rd, user, 000000, 12345678910, 1234567, 12345678, 123456789, ubnt, 1111, 1234, 12345, 123.. ఇలాంటి పాస్ వర్డ్ ని గనుక మీరు వాడుతుంటే వెంటనే దానిని మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి వాటిని హ్యాక్ చేయడానికి రెప్పపాటు సమయం చాలు అంటున్నారు. Pass@123 ఈ తరహా పాస్ వర్డ్ ని హ్యాక్ చేయడానికి 5 సెకన్ల సమయం పడుతుందంట. Admin123 ఇలా ఆల్ఫాబెట్స్, నంబర్స్ కలిసి ఉన్న పాస్ వర్డ్ ని హ్యాక్ చేయడానికి 11 సెకన్ల సమయం పడుతుందంట.

Unknow అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ లెటర్స్ కలిసి ఉన్న పాస్ వర్డ్ హ్యాక్ చేయడానికి 17 సెకన్ల సమయం పడుతుందని చెబుతున్నారు. మీరు గనుక ఇప్పటివరకు చెప్పుకున్న ఎలాంటి పాస్ వర్డ్ ని వాడుతున్నా కూడా వెంటనే దానిని మార్చుకోండి. లేదంటే మీ అకౌంట్స్, వ్యక్తిగత డేటాని హ్యాక్ చేయడానికి పెద్దగా సమయం పట్టదు. ఒక స్ట్రాంగ్ పాస్ వర్డ్ ని ఎలా క్రియేట్ చేయాలి అంటే.. మీకు 8 అంకెల పాస్ వర్డ్ ని పెట్టుకునే అవకాశం ఉంటే మంచిది. అందులో మీరు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి పాస్ వర్డ్స్ ని హ్యాక్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి పాస్ వర్డ్ ఉంటే మీ అకౌంట్స్ కూడా సేఫ్ గా ఉంటాయి. మరి.. ఈ పాస్ వర్డ్స్ నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి