iDreamPost

Mehndi Cone: కరాచీ మెహందీ కోన్ తయారీదారుపై కేసు! మెహందీ ఇంత ప్రమాదమా?

  • Published Dec 13, 2023 | 12:06 PMUpdated Dec 13, 2023 | 12:07 PM

ఈమధ్య కాలంలో సహజసిద్ధంగా లభించే గోరింటాకు కాకుండ.. కోన్, మెహందీ వినియోగం పెరిగింది. అయితే దానిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని.. ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో సహజసిద్ధంగా లభించే గోరింటాకు కాకుండ.. కోన్, మెహందీ వినియోగం పెరిగింది. అయితే దానిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని.. ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..

  • Published Dec 13, 2023 | 12:06 PMUpdated Dec 13, 2023 | 12:07 PM
Mehndi Cone: కరాచీ మెహందీ కోన్ తయారీదారుపై కేసు! మెహందీ ఇంత ప్రమాదమా?

భారతీయ మగువులకు గోరింటాకు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా అరచేతుల్లో గోరింటాకు ఎంత బాగా పండితే… అంతలా ప్రేమించే భర్త వస్తాడని నమ్ముతారు. నెలలు వయసున్న చిన్నారులకు కూడా చేతి నిండా గోరింటాకు పెట్టి.. మురిసిపోతారు. ఇక ఆషాఢ మాసంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని నమ్ముతారు మన దగ్గర. పండగలు, చిన్నా చితకా శుభకార్యాలు సందర్భం ఏదైనా సరే.. కచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల సందర్భంగా మెహందీ పేరుతో ప్రత్యేక వేడుక ఏర్పాటు చేస్తున్నారు.

గోరింటాకు వల్ల అందం మాత్రమే కాక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది వేడిని తగ్గించడమే కాక నరాలపై పనిచేసి తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని అంటారు. అయితే ఈ మధ్య కాలంలో సహజసిద్ధంగా లభించే గోరింటాకుకు బదులు.. హెన్నా, మెహందీ వాడుతున్నారు. దీనితో మనకు నచ్చిన డిజైన్స్ వేసుకునే అవకాశం ఉండటం మాత్రమే కాక.. త్వరగా పండుతుంది. ఇక పట్టణాల్లో గోరింటాకు లభించడం చాలా తక్కువ అందుకే కోన్ వినయోగం పెరిగింది.

mehandi is danger

అయితే ఈ కోన్, మెహందీ చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెన్నా తయారీలో ఉపయోగించే పిక్రామిక్ యాసిడ్ ఆరోగ్యానికి హానీ చేస్తుందని హనుమకొండ డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. స్థానికంగా లభించే గోరింటాకు పేస్ట్‌, కరాచీ మెహందీలో పిక్రామిక్‌ యాసిడ్‌ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హనుమకొండలో సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని డ్రగ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ల్యాబ్ నివేదిక ప్రకారం..మెహందీలో వాడే పిక్రామిక్ యాసిడ్ ఆరోగ్యానికి హానికరం. అందుకే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 కింద కరాచీ మెహందీ కోన్ తయారీదారుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాక కరాచీ మెహందీ కోన్‌ను ఉపయోగించవద్దని ప్రజలకు సూచించారు. నేచురల్‌గా పండే గోరింటాకు పెట్టుకోవటం ఉత్తమమని.. అందం కోసం ఆరోగ్యాలను ప్రమాదంలో పడేయటం సరైంది కాదన్నారు. కనుక మెహందీ కోన్ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి