iDreamPost

సమ్మె అవాస్తవం.. ప్రచారాన్ని ఖండించిన వలంటీర్ల సంఘాలు!

Volunteer: ఏపీలో వలంటీర్లు సమ్మె బాట పట్టారంటూ విపక్ష పార్టీలు, ఎల్లో మీడియా చేసిన ప్రచారం పటాపంచలైంది. వలంటీర్లు సమ్మె చేస్తున్నారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆ సంఘాలు ఖండించాయి.

Volunteer: ఏపీలో వలంటీర్లు సమ్మె బాట పట్టారంటూ విపక్ష పార్టీలు, ఎల్లో మీడియా చేసిన ప్రచారం పటాపంచలైంది. వలంటీర్లు సమ్మె చేస్తున్నారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆ సంఘాలు ఖండించాయి.

సమ్మె అవాస్తవం.. ప్రచారాన్ని ఖండించిన వలంటీర్ల సంఘాలు!

కొందరు మంచి చేయకున్న చెడ్డు చేసేందుకు మాత్రం ముందు ఉంటారు. అలాంటి వారు కేవలం  ఒక వర్గం, ఒక వ్యవస్థలోనే కాకుండా, అన్ని చోట్ల ఉంటారు. అలాంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత గొప్ప  కార్యక్రమాలు చేసిన.. అవాస్తవంగా చూపించేందు విపక్షాలు, కొన్ని పచ్చ మీడియాలు కష్టపడుతుంటాయి. ఇప్పటి దాకా అనేక అంశాలపై  ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయాలని చూసి.. వారే అభాసుపాలైన ఘటనలు అనేకం జరిగాయి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వారు సమ్మె చేస్తున్నారంటూ ఓ ప్రచారానికి తెరలేపారు. దీనిపై వలంటీర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాము సమ్మె చేస్తున్నామనేది అవాస్తవమని వారు తెలిపారు.

ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడ చూస్తుంటే చాలా సిగ్గుగా ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం చేసే మంచి చెడులను చూసి.. సలహా ఇవ్వాల్సిన ప్రతిపక్ష పార్టీలు, పచ్చ కామెర్లు వచ్చిన వాడి మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఏ  పని  చేసిన కూడా దానిని అపకీర్తి పాలు చేయాలనే చూస్తున్నాయి.. కొన్ని పచ్చ మీడియాలు, విపక్షాలు. ఈక్రమంలోనే నిన్న మొన్నటి వరకు వలంటీర్లను సంఘ విద్రోహశక్తులుగా ప్రతిపక్ష పార్టీలు, వారి అనుకూల మీడియా చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా వలంటీర్లలో కొందరినైనా చీల్చి వారిలో ప్రభుత్వంపై కోపం రగిల్చి సమ్మెబాట పట్టించాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి.

తామెలాంటి సమ్మెలో పాల్గొనడంలేదని వాలంటీర్ల సంఘాలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ఆయా వలంటీర్లు తమ విధులకు సంబంధిచిన అంశాలపై తలెత్తే సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జిల్లాల వారీగా లేదా అనధికారికంగా సోషల్‌ మీడియా గ్రూపులు ఏర్పాటుచేసుకున్నారు. అయితే వివిధ ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు కొందరు వలంటీర్ల ముసుగులో ఆ గ్రూపుల్లోకి చేరి..వలంటీర్లను రెచ్చగొట్టాలన్న లక్ష్యంతో పోస్టులు పెడుతూ వచ్చారని వలంటీర్లు తెలిపారు. ఆ తర్వాత  ఆ కొందరు దృష్ట శక్తులే ప్రభుత్వం వలంటీర్ల జీతాలు అప్పుడు పెంచబోతోంది, ఇప్పుడు పెంచబోతోందని అంటూ గ్రూపుల్లో అనవసర చర్చ పెట్టారని తెలిపారు.

అనంతరం సమ్మె అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ వచ్చేవారని వలంటీర్ల సంఘాలు తెలిపాయి.  ఇదే సమయంలో నిజమైన వలంటీర్లు వాటిని ఎప్పటికప్పుడు ఖండించమో లేక అసలు వాటిని పట్టించుకోకపోవడం చేసేవారని తెలిపారు. సమ్మెచేయాలనే ఆలోచన ఎవరికి లేకపోయినా.. ప్రేరేపిత పోస్టులకు స్పందించే ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు సమ్మెకు దిగుతున్నారని మిగిలిన వలంటీర్లను రెచ్చగొట్టి వారితో సమ్మె ముసుగులో ఆందోళన చేపట్టేందుకు విపక్ష టీడీపీతో సహా మరికొన్ని రాజకీయ పక్షాలు యత్నిస్తున్నాయని వలంటీర్ల సంఘాలు తెలిపాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి