iDreamPost

CM Jagan: హైదరాబాద్‌ కన్నా వైజాగ్‌ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది: CM జగన్‌

  • Published Mar 05, 2024 | 12:42 PMUpdated Mar 05, 2024 | 12:42 PM

Vision Visakha: విశాఖ అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలో విశాఖ అభివృద్ధిపై చర్చించడం కోసం విజన్‌ విశాఖ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Vision Visakha: విశాఖ అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలో విశాఖ అభివృద్ధిపై చర్చించడం కోసం విజన్‌ విశాఖ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Mar 05, 2024 | 12:42 PMUpdated Mar 05, 2024 | 12:42 PM
CM Jagan: హైదరాబాద్‌ కన్నా వైజాగ్‌ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది: CM జగన్‌

సాగరనగరం విశాఖపట్నం.. పర్యాటక పరంగానే కాక.. పెట్టుబడులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతిగా గెలిచిన చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధాని పేరుతో భారీ మోసాలకు, భూకుంభకోణానికి పాల్పడ్డాడు. రాజధాని పేరుతో ఆయన హాడావుడి తప్ప రాష్ట్రానికి పెద్దగా చేసింది ఏం లేదు. పైగా కొత్త రాజధాని నిర్మాణం పేరు చెప్పి టీడీపీ నేతలు భారీగా దండుకున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.. కానీ కనీసం ఒక్క స్థిరమైన నిర్మాణం కూడా చేపట్టలేదు. రాజధాని నిర్మాణం అనేది ఏపీకి తీరని భారంగా మారింది.

ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చాడు. రాజధాని పేరుతో అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమైతే.. ఎలాంటి నష్టం వాటిల్లుతుందో రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్షంగా చూసిన జగన్‌.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి.. దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నగరానికి కొత్త సొబుగులద్దడం మాత్రమే కాక.. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించారు.

దానిలో భాగంగా విశాఖలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం కోసం సాగరనగరంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించి.. విశాఖను విశ్వవ్యాప్తంగా ప్రమోట్‌ చేశారు జగన్‌. అంతేకాక భవిష్యత్తులో విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం కోసం ఉన్న వనరేలేంటి.. అనే దానిపై చర్చించేందుకు తాజాగా సీఎం జగన్‌ విజన్‌ విశాఖ కార్యక్రమాన్ని చేపట్టారు. వేర్వేరు రంగాలకు చెందిన 2 వేల మంది ప్రముఖులతో దీనిపై చర్చించేందుకు గాను మంగళవారం నాడు సీఎం జగన్‌ విశాఖకు తరలి వచ్చారు. రాడిసన్‌ బ్లూ హోటల్లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయాం. దీని ప్రభావం ఏపీపై పడింది. ఇప్పుడు వైజాగ్‌ నగరం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌ కంటే కూడా భవిష్యత్తులో వైజాగ్‌ ఎంతో అత్యున్నత స్థితికి చేరేలా అభివృద్ధి అవుతుంది. బెంగళూరు కంటే విశాఖలో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి.. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు రాసుకొస్తున్నాయని’’ తెలిపారు.

జగన్‌ మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఆంధ్రాలో తలసరి ఆదాయం పెరిగింది. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నాం. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో నిరుద్యోగం తగ్గింది.. ఉపాధి అవకాశాలు పెరిగాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్వయం సహాయక బృందాల పెండింగ్‌ రుణాలను మాఫీ చేశాం’’ అని చెప్పుకొచ్చారు.

‘‘వైజాగ్‌ నగరం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించాం. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉంది. అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోంది. రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకం’’ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి