iDreamPost

విశాఖలో ఈ చెట్టు పేరు వింటేనే హడలిపోతున్న జనాలు.. ఎందుకంటే!

సాధారణంగ చెట్లు మనుషులకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి. పర్యావరణాన్ని కాపాడటం కోసం ఎక్కువగా చెట్లను నాటాలని అంటుంటారు. ఈ క్రమంలోనే రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటుతుంటారు.

సాధారణంగ చెట్లు మనుషులకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి. పర్యావరణాన్ని కాపాడటం కోసం ఎక్కువగా చెట్లను నాటాలని అంటుంటారు. ఈ క్రమంలోనే రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటుతుంటారు.

విశాఖలో ఈ చెట్టు పేరు వింటేనే హడలిపోతున్న జనాలు.. ఎందుకంటే!

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం చెట్లను నరికివేయడం అని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. అందుకే పెద్దలు ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటారు. చెట్లను మనం రక్షిస్తే.. చెట్లు మనల్ని రక్షిస్తాయని అంటారు. చెట్లు లేకపోతే మానవ జీవనాధారమైన ఆక్సీజన్ లభించదు. మానవ మనుగడ, సర్వజీవులు సుఖ జీవనానికి వృక్ష సంపద ఎంతో ముఖ్యం అని పురణాలు చెబుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వృక్షాలను దేవతలుగా పూజిస్తుంటారు. మన దేశంలో ఎన్నో చెట్లకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు. అలాంటిది విశాఖ వాసులు ఓ చెట్టు పేరు చెబితే గజ గజ వణికిపోతున్నారు. ఓ చెట్టు నుంచి వచ్చే గాలి ఇక్కడ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అంతలా భయపెడుతున్న ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా రోడ్డు పక్కన చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద కూర్చొని కాస్త సేద తీరాలని అనిపిస్తుంది. చెట్టుకి కాసే పూలు వెదజల్లే సువాసనలు అహ్లాదాన్ని ఇస్తుంటాయి.. మనసు ఎంతో తెలిక పరుస్తుంటాయి. కానీ విశాఖ పట్టణంలో మాత్రం ఆ చెట్ల పూలను చూడటానికి గానీ, వాసన పీల్చడానికి కానీ ప్రజలు భయపడిపోతున్నారు. ఒక రకంగా దాన్ని డెవిల్ ట్రీ.. అంటే దెయ్యం చెట్టు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం విశాఖవాసులకు కొత్త భయం పట్టుకుంది. ఆ చెట్ల నుంచి వచ్చే గాలి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా భయపెడుతున్నాయి. పచ్చదనం కోసం ఉడా అధికారులు నాటిన చెట్టు ఇప్పుడు ప్రాణ సంకటంగా మారాయని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఏపీలో హుద్ హుద్ తుఫాన్ తో విశాఖలో ఉన్న పచ్చదనం అంతా కొటుకుపోయింది. భారీ చెట్లు సైతం నేలరాలాయి. దీంతో ఉడా అధికారులు గ్రీన్ ప్రాజెక్ట్ కింద నగరంలోని రహదారుల్లో ఇరువైపుల పెద్ద ఎత్తున ఏడాకుల చెట్లను విస్తారంగా నాటారు. ఆల్ స్టోనియా స్కోలరీస్ అనే శాస్త్రీయ నామం గల ఈ చెట్లను దాదాపు ఐదు లక్షలకు పైగా నాటినట్టు తెలుస్తుంది. తక్కువ సమయంలో ఏపుగా పెరిగి రోడుకు ఇరువైపులా నీడను ఇస్తుందన్న ఉద్దేశంతో ఈ చెట్లను నాటారు. ఇప్పుడు ఇదే అధికారులకు తలనొప్పిగా మారింది.

devil tree in vizag

అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ చెట్టును గిరిజనులు కన్నెత్తి కూడా చూడరు.. అటు వైపు వెళ్లరు. ఈ చెట్లును దెయ్యం చెట్టు అని పిలుస్తుంటారు. విశాఖలో రోడ్లకు ఇరువైపుల నాటిన చెట్లు ఇప్పుడు ఏపుగా పెరిగాయి. కానీ వీటి దుష్ప్రభావం తీవ్రంగా చూపిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ చెట్టు పువ్వు నుంచి పుప్పొడి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదకరం అని అంటున్నారు. ఏడాకుల పాల చెట్లు నీళ్లు లేకున్నా ఏపుగా అత్యంత వేగంగా పెరుగుతాయి. గుండ్రంగా ముదురు ఆకుపచ్చగా గుచ్చంలాం ఉంటాయి. ఒక్కో గుచ్చానికి ఏడు ఆకులు ఉంటాయి. వీటిని గిల్లితే పాలు కారుతాయి. అందుకే ఈ చెట్టును ఏడాకుల పాల చెట్టు అని పిలుస్తారు. అక్టోబర్ మాసంలో చలికాలం సీజన్ లో ఈ చెట్టు కొమ్మలకు ఉన్న పుష్పాలు ఒకేసారి పుష్పిస్తాయి. దీన్నే ది మాస్ బ్లూమింగ్ అని అంటారు. ఒక చెట్టు కొమ్మలో వెయ్యి పూలు ఉంటే.. అవన్నీ ఒకేసారి విరబూస్తాయి. ప్రతి పూవు నుంచి ఆస్మోఫోర్స్ అనే కెమికల్స్ ఉంటాయి.. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.

ఏడాకులు పాల చెట్టు నుంచి వచ్చే పుప్పొండి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదం అని అంటున్నారు. వాటి వాసన పీల్చితే.. శ్వాస కోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఆ చెట్టు కింద కొద్ది సమయం గడిపితే ఊపిరితిత్తుల్లో పుప్పడి రేణువులు పేరుకుపోయి శ్వాస ఇబ్బందిగా మారి స్పృహ కోల్పోవడం.. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అంటున్నారు. ఎక్కువగా ఈ చెట్టు ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ చేసేవాళ్ళు, వృద్దులు, పిల్లలపై ప్రభావం కొంతమంది స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు, పర్యావరణ శాస్త్ర వేత్తలు మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. గుండె సంబంధిత వ్యాధులు, సైనస్ ఇబ్బందులు ఉన్నవారు.. ఎక్కువ పుప్పొడి రేణువులు పీల్చడం వల్ల ఇబ్బంది పడి ఉండవొచ్చు అంటున్నారు. చిన్నగా ఉన్నపుడు ఈ చెట్టుతో ఇబ్బందులు లేవని.. ఏపుగా పెరిగి పుష్పాలు పూసిన తర్వాతనే దీని ప్రభావం చూపిస్తుందని స్థానికులు అంటున్నారు. ఈ చెట్లను తొలగించాలని మున్సిపాలిటీ వాళ్లకు చెబుతున్నామని అంటున్నారు.

అధికారులు మాత్రం ఈ చెట్లు దాదాపు ఐదు లక్షల వరకు నాటామని.. ఒకేసారి తొలగించడం అంటే కుదరని పని అని.. చెట్ల నుంచి పూలను తొలగించే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  ఈ చెట్ల కలప నుంచి బ్లాక్ బోర్డులు, అగ్గి పుల్లల తయారీలో వాడతారని.. ఈ చెట్లను కొన్ని జాగ్రత్తలు తీసుకొని నాటాలని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లు హై వేలో నాటవొచ్చని.. మనుషులు నివసించే ప్రదేశాలకు దూరంగా నాటవొచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏడాకులు పాల చెట్టు గురించి విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి