iDreamPost

500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ! మొట్టమెదటి క్రికెటర్​గా రికార్డు!

  • Author singhj Published - 08:47 PM, Fri - 21 July 23
  • Author singhj Published - 08:47 PM, Fri - 21 July 23
500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ! మొట్టమెదటి క్రికెటర్​గా రికార్డు!

రన్​ మెషీన్ విరాట్ కోహ్లి వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగి ఆడుతున్నాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్​లో కింగ్ కోహ్లీ సెంచరీ బాదాడు. సహచర ప్లేయర్లు ఒక్కొక్కరు ఔటై పెవిలియన్​కు చేరుతున్న టైమ్​లో క్రీజులో అడ్డుగోడలా నిలిచాడు విరాట్. అదే జోరుతో ఆడుతూ తన 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్​ను చిరస్మరణీయం చేసుకున్నాడు. తనను పరుగుల యంత్రం అని ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రూవ్ చేశాడు. ఈమధ్య కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్.. విండీస్​తో రెండో టెస్టులో సెంచరీతో కదంతొక్కాడు.

విండీస్​పై తాజా శతకంతో టెస్టు క్రికెట్​లో 29వ సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు కోహ్లి. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి ఓవరాల్​గా విరాట్​కు ఇది 76వ సెంచరీ కావడం విశేషం. ఈ విషయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. అయితే ప్రస్తుత క్రికెట్​లో మాత్రం విరాట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈతరం ఆటగాళ్లలో జో రూట్ 46 సెంచరీలు, డేవిడ్ వార్నర్ 45 సెంచరీలతో ఉన్నారు. తాజా శతకంతో పలు రికార్డులను విరాట్ బ్రేక్ చేశాడు. ఓవర్సీస్​లో అత్యధిక సెంచరీలు బాదిన లిస్టులో సచిన్ (29 శతకాలు)​ తర్వాతి ప్లేసులో నిలిచాడు కోహ్లి (28 శతకాలు).

ఇక, విండీస్​తో మ్యాచ్​ విషయానికొస్తే.. విరాట్ తన క్లాస్​ ఆటతీరుతో అదరగొట్టాడు. ట్రిక్కీ పిచ్​పై ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (57), రోహిత్ శర్మ (80) హాఫ్ సెంచరీలతో రాణించి టీమిండియాకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత రోహిత్ సేన ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో తన అనుభవాన్ని రంగరించి ఆడిన విరాట్.. రవీంద్ర జడేజాతో కలసి జట్టును ముందుకు నడిపించాడు. వీళ్లిద్దరూ గురువారం చివరి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిని విసిగించారు. కోహ్లి శుక్రవారం ఉదయం కూడా అదే ఊపును కొనసాగించాడు. భారత్ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 336 రన్స్​తో ఉంది. కోహ్లి (118 నాటౌట్), జడేజా (53 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి