iDreamPost

కోహ్లీ బర్త్‌డే నాడు అనుష్క స్పెషల్‌ పోస్ట్‌.. ఆ అరుదైన ఘనత నా భర్తకే సొంతం

  • Published Nov 05, 2023 | 6:26 PMUpdated Nov 05, 2023 | 6:26 PM

కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే నేడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోహ్లీ భార్య అనుష్క.. తన భర్త సాధించిన ఓ అరుదైన రికార్డును ప్రస్తావించింది. ఆ వివరాలు..

కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే నేడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోహ్లీ భార్య అనుష్క.. తన భర్త సాధించిన ఓ అరుదైన రికార్డును ప్రస్తావించింది. ఆ వివరాలు..

  • Published Nov 05, 2023 | 6:26 PMUpdated Nov 05, 2023 | 6:26 PM
కోహ్లీ బర్త్‌డే నాడు అనుష్క స్పెషల్‌ పోస్ట్‌.. ఆ అరుదైన ఘనత నా భర్తకే సొంతం

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, ఛేజ్ మాస్టర్, కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే నేడు. నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకొని.. 35వ వసంతంలోకి ప్రవేశిస్తున్నాడు కోహ్లీ. ఈనేపథ్యంలో.. క్రికెట్‌ ప్రముఖులు, అభిమానులు మాత్రమే కాక, సినీ, రాజకీయ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోహ్లీ తోటి ప్లేయర్స్‌.. అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ బర్త్‌డే సందర్భంగా.. ఆయన భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ..బర్త్‌డే విషెస్‌ చెబుతూ.. కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును ప్రస్తావించింది. ఆ వివరాలు..

ఈ సందర్భంగ అనుష్క కోహ్లీ గురించి చెప్పుకొస్తూ.. తన భర్త అతడి జీవితంలోని ప్రతి పాత్రలో ఎంతో అసాధారణంగా ఉంటాడని పేర్కొన్నది. తాను జీవితమంతా కోహ్లీనే ప్రేమిస్తానని తెలిపింది. అలానే కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును ఈ సందర్భంగా పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్‌ చేసిన కోహ్లీ.. ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. నేడు బర్త్‌డే సందర్భంగా కోహ్లీ రికార్డును గుర్తు చేసిన అతని సతీమణి.. ఇలాంటి ఘనత తన భర్త తప్ప మరెవరూ ఇప్పటివరకూ సాధించలేదంటూ ప్రశంసించింది.

కోహ్లీ-అనుష్కలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న వీరు.. 2017, డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు వామిక ఉంది.త్వరలోనే ఈ జోడి రెండో బిడ్డకు జన్మినివ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి