iDreamPost

వీడియో: ఇది మేము చూడలా.. కారులోకి ఒంటె.. అలా ఎలా దూరింది?

Viral Video Of A Camel Went Into A Car: మీరు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు, మీమ్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి వీడియో మాత్రం చూసి ఉండరు. ఈ వీడియోలో ఒంటె ఏకంగా కారులోకి వెళ్లిపోయింది.

Viral Video Of A Camel Went Into A Car: మీరు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు, మీమ్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి వీడియో మాత్రం చూసి ఉండరు. ఈ వీడియోలో ఒంటె ఏకంగా కారులోకి వెళ్లిపోయింది.

వీడియో: ఇది మేము చూడలా.. కారులోకి ఒంటె.. అలా ఎలా దూరింది?

మీరు సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతూ ఉంటే మీకు చాలానే ఫన్నీ వీడియోలు, వైరల్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు నవ్వు తెప్పిస్తే.. ఇంకొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా అవాక్కయ్యేలా చేస్తాయి కూడా. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అసలు ఆ వీడియో చూశాక మీరు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఒక ఒంటె ఏకంగా కారులో దూరేసింది. అసలు అలా ఎలా జరిగింది అంటూ చూసిన వాళ్లంతా తలలు పట్టుకుంటున్నారు. ఇంకొంత మంది అయితే గుడారంలో దూరిన ఒంటె కథను వల్లె వేస్తున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం.

అయితే ఇక్కడ జరిగింది మాత్రం ఫన్నీ థింగ్ కాదు. వీడియో చూడగానే ఒంటె కారులో దూరినట్లు కనిపిస్తోంది. కానీ, అక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒంటె రోడ్డు మీదకు రావడంతో అటుగా వెళ్తున్న కారు వేగంగా దానిని ఢీకొట్టింది. దాంతో ఒంటె కారులో ఇరుక్కుపోయింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ గఢ్ ప్రాంతంలో జరిగింది. హనుమాన్ గఢ్ లో ఓ ఒంటె రోడ్డు మీద వెళ్తూ ఉంది. రాత్రి సమయం కావడంతో కారు నడుపుతున్న వ్యక్తి గమనించినట్లుగా లేడు. ఒంటెను ఒక్కసారిగా ఢీకొట్టడంతో అది కాస్తా కారులో ఇరుక్కుపోయింది. ఆ ప్రమాదంలో దాదాపుగా ఒంటె కారులో కూర్చున్నట్లు అయిపోయింది. దానిని తీయడానికి కూడా చాలానే కష్టపడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ అతి కష్టం మీద ఒంటెను బయటకు తీశారు. అందుకోసం కొన్ని గంటలు శ్రమించాల్సి వచ్చింది.

ప్రమాదంలో గాయపడిన ఒంటె బాధతో విలవిల్లాడిపోయింది. ఆఖరికి క్రేన్ సాయంతో ఆ ఒంటెను బయటకు తీశారు. దానికి బాగా గాయాలు కావడంతో పశు వైద్యుడిని కూడా తీసుకొచ్చారు. ఆ వైద్యుడు ఒంటెకు అయిన గాయాలను పరిశీలించి దానికి వైద్యం చేశాడు. ఇంక ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి కూడా బాగానే గాయాలు అయ్యాయి. ఒంటె కారులోకి వచ్చేయడంతో విండ్ షీల్డ్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆ వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రాత్రిపూట వాహనాలు నడిపేవాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జంతువులు సంచరించే ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి అని కోరుతున్నారు. మరి.. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి