iDreamPost

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలపై విజయసాయి రెడ్డి ఫిర్యాదు

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలపై విజయసాయి రెడ్డి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తన పేరు మీద నడుపుతున్న ఫేక్ ఎకౌంట్లపై ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం పొలీసులకు ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన ఫేక్ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు,సైబర్ క్రైం చట్టం కింద వారిపై కఠిన చర్యలు తప్పవని సైబర్ క్రైం వారి నుండి నిందితులు తప్పించుకోలేరని చెప్పుకొచ్చారు.

ఇటీవలకాలంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదార్లు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి వారి గురించి వారి వ్యక్తిగత వ్యవహారాల గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారనే విషయం, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి వారి దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆ నకిలీ ఖాతాల పూర్తి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. వీరిని త్వరలోనే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శింక్షించాలని కోరారు.

ఇటీవల కాలంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో మా పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పనిచేయాలనుకునే వారు తమని సంప్రదించవచ్చు అని, పనిచేసినందుకు వారికి వేతనం కూడా చెల్లిస్తాం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా చంద్రబాబు నాయుడు చెప్పిన రెండు రోజుల్లోనే వందల కొద్ది నకిలీ ఖాతాలు సోషల్ మిడియాలో పుట్టుకొచ్చాయనే అభిప్రాయం కలుగుతుంది. ఏది ఏమైనా విధానపరంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు ఇలా నకిలీ ఖాతాలతో నాయకుల పై అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి