iDreamPost

ఉద్యోగానికి వెళ్లింది.. రాత్రైనా ఇంటికి రాలేదు.. తీరా..

ఉద్యోగానికి వెళ్లింది మనీషా. రాత్రి 8 అయినా ఇంటికి రాలేదు. ఏం జరిగిందా అని ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. అంతలో ఫోన్.. మనీషా మీ కూతురేనా అని..

ఉద్యోగానికి వెళ్లింది మనీషా. రాత్రి 8 అయినా ఇంటికి రాలేదు. ఏం జరిగిందా అని ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. అంతలో ఫోన్.. మనీషా మీ కూతురేనా అని..

ఉద్యోగానికి వెళ్లింది.. రాత్రైనా ఇంటికి రాలేదు.. తీరా..

జీవితం తామరాకు మీద నీటి బొట్టులాంటిది. ఎప్పుడు ఆ నీటి బొట్టు కింద పడిపోతుందో చెప్పడం కష్టమైనట్లు.. మనిషి ప్రాణాలు కూడా ఎలా పోతాయే ఎవ్వరూ ఊహించలేం. అయితే ప్రతి మనిషికి తెలుసు.. పుట్టిన వాడు గిట్టక తప్పదని. కానీ చాలా మంది.. తాము హఠాత్తుగా.. మంచం మీద పడిపోకుండా చనిపోవాలని కోరుకుంటారు. నొప్పి తెలియకుండా మరణించాలనుకుంటున్నారు. దీన్ని ఎంతో అదృష్టమైన చావుగా భావిస్తారు. అలాంటి మరణమే రావాలని కోరుకుంటారు. అది ఓ వయస్సు మీద పడి.. జీవిత సారాన్ని చూసిన వాళ్లు ఇలాంటి ఫీలింగ్స్‌తో ఉంటారు. కానీ ఎంతో జీవితాన్నిచూడాల్సిన యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. జీవితంపై ఎంతో మమకారంగా ఉంటారు. కానీ ఊహకందని రీతిలో మృత్యువాత పడుతూ.. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచెస్తున్నారు.

ఇటీవల పూణె ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో తెలుసు. మైనర్ తప్పతాగి.. ఇద్దరు టెకీలు వస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టడంతో మరణించిన సంగతి విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఇద్దరు యంగర్స్ మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మరో అమ్మాయి, అబ్బాయి కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో మనీషా బెగోరాయ్, పూర్ణచంద్ర మహానందియాలు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కొరాపూట్ జిల్లా బొరిగుమ్మ మణికేశ్వర్ కాలనీకి చెందిన మనీషా, కల్యాణ సింగపూర్ సమితి పండ్రపడ గ్రామానికి చెందిన పూర్ణ చంద్ర.. సికరపాయిలోని హర్ష ట్రస్ట్ అనే స్వచ్చంద సంస్థలో పనిచేస్తున్నారు.

ఎప్పటిలాగే విధుల్లో భాగంగా గురువారం రాయగడకు వచ్చారు. పనులు ముగించుకుని సికరపాయికి తిరిగి స్కూటర్ పై బయలు దేరారు. చందిలి పోలీస్ స్టేషన్ పరిధి బాకుర గుడ వద్దకు రాగానే.. వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీ కొట్టింది. కాగా, ఘటనాస్థలిలోనే మనీషా మృతి చెందింది. పూర్ణ చంద్రను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు వీరి మరణవార్త చేరింది. దీంతో కుటుంబం కన్నీరుమున్నీరు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి