iDreamPost

చర్చిలో వరుస బాంబు పేలుళ్లు.. మహిళ మృతి!

గత కొన్నిరోజులుగా ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య భీకర యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

గత కొన్నిరోజులుగా ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య భీకర యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

చర్చిలో వరుస బాంబు పేలుళ్లు.. మహిళ మృతి!

ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది. హమాస్ పై ప్రతీకారంతో గాజా నగరంపై మూడు వారాలుగా ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పపడుతుంది. మొన్నటి వరకు ఆకాశ మార్గాన యుద్దం జరిగితే.. ఇప్పుడు భూతల యుద్దాన్ని ప్రారంభించింది. ఈ దాడులకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం కేరళాలో కొంతమంది ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగిన కొద్ది గంటల్లోపే వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. వివరాల్లోకి వెళితే..

కేరళాలోని ఎర్నాకులంలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎర్నాకుళం-కొచ్చి జంట నగరాల్లో కలమసేరిలో ఓ ప్రార్థనా మందిరంలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. 9.30 గంటల ప్రాంతంలో తొలి పేలుడు జరిగింది.. కొద్ది సమయం వ్యవధిలో మరో రెండు పెలుళ్లు సంభవించాయి. ఈ ఘటన మకలసేరి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా.. 35 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు.

ఎక్కువ జనసమూహం ఉన్న ప్రాంతాలను దుండగులు టార్గెట్ చేసు దాడులకు పాల్పపడినట్లు తెలుస్తుంది. పేలుళ్ల సమయంలో కన్వెన్షన్ సెంటర్ లో రెండు వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వరుస బాంబు దాడుల తర్వాత చుట్టుపక్కల ప్రాంతం అంతా భారీగా పొగ అలుముకోవడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి తెచ్చారు సిబ్బంది. ప్రార్ధనా మందిరాలు టార్గెట్ చేసుకొని వరుస బాంబు పేలుళ్లకు పాల్పపడటంతో కేరళా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి