iDreamPost

సంక్రాంతి పండగ సందర్భంగా TSRTC గుడ్ న్యూస్!

  • Published Jan 05, 2024 | 11:59 AMUpdated Jan 05, 2024 | 12:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకం చేశారు. అందులో భాగాంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. తెలంగాణ ఆర్టీసీ విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకం చేశారు. అందులో భాగాంగా మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. తెలంగాణ ఆర్టీసీ విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • Published Jan 05, 2024 | 11:59 AMUpdated Jan 05, 2024 | 12:07 PM
సంక్రాంతి పండగ సందర్భంగా  TSRTC గుడ్ న్యూస్!

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేద ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల బీమా సౌకర్యం. అంతేకాదు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇక టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీ సజ్జనార్ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఆర్టీసీని లాభాల బాట పట్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి జీవిస్తున్నారు.  ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా ఈసారి 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని.. జనవరి 6 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు నడపాలని ప్రణాళిక రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ తెలంగాణ బార్డర్ వరకు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత వారి గమ్యస్థానాలకు టికెట్ కొనాల్సి ఉంటుందని అన్నారు.

TSRTC Good News on Sankranthi!

ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు మెరుగైన, సురక్షితమైన బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నాం..తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపతున్నాం.. ఎలాంటి పెంపుదల లేదు. ఎల్ బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ, అరామ్ ఘర్ వంటి ప్రదేశాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుంది.. ఇందుకోసం బస్సులు ఎక్కేందుకు వేచి ప్రయాణికుల కోసం ప్రత్యేక శిభిరాల్లో తాగు నీరు, మొబైల్ బయో-టాయిలెట్లు ఏర్పాటు చేశాం’ అని అన్నారు. సుదూర ప్రయాణం చేసేవారికి బస్సులో ప్రయాణికుల కోసం ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి.’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి