iDreamPost

కోహ్లీని విమర్శించే వారికి ఆకాశ్ చోప్రా కౌంటర్.. సిగ్గుండాలి అంటూ..!

వరల్డ్ కప్ 2023లో టీమిండియా పరాభవాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో నెట్టింట కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. అలాంటి ట్రోలర్స్ కు ఆకాశ్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

వరల్డ్ కప్ 2023లో టీమిండియా పరాభవాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో నెట్టింట కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. అలాంటి ట్రోలర్స్ కు ఆకాశ్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

కోహ్లీని విమర్శించే వారికి ఆకాశ్ చోప్రా కౌంటర్.. సిగ్గుండాలి అంటూ..!

వరల్డ్ కప్-2023లో టీమిండియా ఓటమి పాలైంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు గల్లంతయ్యయి. మ్యాచ్ ముగిసి ఇన్ని రోజులు అయినా కూడా ఆ బాధ నుంచి అభిమానులు ఇంకా తేరుకోలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ వరల్డ్ కప్ ఫైనల్ గురించి చర్చ, రచ్చ జరుగుతూనే ఉన్నాయి. కోహ్లీని పొగిడివాళ్లు పొగుడుతుంటే.. విమర్శించే వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీ వల్లే టీమిండియా ఓటమిపాలైందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అలా ట్రోల్ చేసే వారికి ఆకాశ్ చోప్రా చురకలు అంటించారు. కోహ్లీని విమర్శించే వాళ్లకు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఎంత బాగా రాణించాడో అందరూ చూశారు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ శతకం నమోదు చేసి.. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే నెట్టింట వింత విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. కోహ్లీ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నాడని, అతని స్లో బ్యాటింగ్ వల్లే టీమిండియా నష్టపోయిందని కామెంట్లు పెడుతున్నారు. అలాంటి వారికి ఆకాశ్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. “టీమిండియా విజయం కోసం విరాట్ కోహ్లీ శ్రాయశక్తులా కృషి చేశాడు. టీమిడింయా మేనేజ్మెంట్ తనకు ఏదైతే బాధ్యతను ఇచ్చిందో.. కోహ్లీ దానిని పూర్తి చేశాడు. అసలు కోహ్లీని విమర్శించడానికి సిగ్గుండాలి.

జట్టుకు అవసరమైనప్పుడల్లా అద్భుతమైన బ్యాటింగ్ తో రాణించాడు. జట్టు విజయం కోసం చేయాల్సిందల్లా చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ పై శతకం చేశాడు. ఫైనల్లో అర్ధ శతకంతో రాణించాడు. ఇంతకన్నా విరాట్ కోహ్లీ ఇంకా ఏం చేయగలడు. ఇంకా అతడిని అర్థంలేని ఆరోపణలతో విమర్శలు చేస్తున్నారు. అసలు ఇందుకు కారణం.. సోషల్ మీడియాలో ఇలాంటి కొన్ని వ్యాఖ్యలను అనుమతించడమే. ఈ మాటలు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి కాబట్టే” అంటూ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక వరల్డ్ కప్ 2023లో విరాట్ ప్రదర్శన చూస్తే.. 11 ఇన్నింగ్స్ లో మొత్తం 765 పరుగులు చేశాడు. వీటిలో 3 శతకాలు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. ఇంక టీమిండియా విషయానికి వస్తే.. వరల్డ్ కప్ ఓటమిని దిగమింగి మళ్లీ ఆసీస్ తో టీ20 సిరీస్ కి సిద్ధమైంది. నవంబర్ 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతోంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో కూడా టీమిండియాకు ద్వైపాక్షిక సిరీస్ ఉంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా- అఫ్గానిస్తాన్ టీమ్స్ మధ్య సిరీస్ జరగనుంది. ఇలా వరుస మ్యాచులతో టీమిండియా ఫుల్ బిజీగా మారబోతోంది. ఈ మ్యాచులతోనైనా ఈ వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోతామంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీని విమర్శించే వారికి ఆకాశ్ చోప్రా ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి