iDreamPost

పులికి మాత్ర‌మే గ్రీన్ సిగ్న‌ల్: పులి రోడ్డును దాట‌డానికి కార్లు, బైక్ ల‌ను ఆపిన ట్రాఫిక్ పోలీస్

పులికి మాత్ర‌మే గ్రీన్ సిగ్న‌ల్:  పులి రోడ్డును దాట‌డానికి కార్లు, బైక్ ల‌ను ఆపిన ట్రాఫిక్ పోలీస్

హైవే రోడ్డు మీద ట్రాఫిక్. రోడ్డును దాట‌డానికి పులి వెయిట్ చేస్తోంది. అందుకే ట్రాఫిక్ పోలీస్ కార్లు, బైక్ ల‌ను ఆపేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీసు అడవి పులిని రోడ్డు దాటడానికి వీలుగా, హైవే సిగ్నల్ వ‌ద్ద ట్రాఫిక్ ను కాసేపు ఆపేశాడు.

ట్విట్టర్‌లో ఫారెస్ట్ ఆఫీస‌ర్ (IFS) పర్వీన్ కస్వాన్ ఈ వీడియో షేర్ చేశాడు. “పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్. ఈ అందమైన వ్యక్తులు. తెలియని ప్రదేశం” అని క్యాప్ష‌న్ పెట్టాడు.


వైరల్ వీడియోలో, ట్రాఫిక్ పోలీసు రహదారికి ఇరువైపులా, వాహనదారులను నిలిపివేసి, హార్స్ కొట్ట‌వ‌ద్ద‌ని, శ‌బ్ధాలు చేయ‌వ‌ద్ద‌ని సిగ్న‌ల్స్ ఇచ్చాడు. అంతా ప్ర‌శాంతంగా వున్న‌వేళ‌, చెట్ల వెనుక నుండి ఒక పులి నెమ్మ‌దిగా బైట‌కొచ్చింది. నెమ్మ‌దిగా రెడ్డు దాటుతోంది.

బైక్‌లు, కార్ల‌లో ఉన్న‌వాళ్లు ఊరుకొంటారా? వెంట‌నే మొబైల్స్ తో పులి ఫోటోను క్లిక్ చేశారు. వీడియోలు తీశారు. రోడ్డు దాటి, అడ‌విలోకి వెళ్లేవ‌ర‌కు అంద‌రూ ఓపిగ్గా ఉన్నారు. ఆ త‌ర్వాత‌నే ట్రాఫిక్ మ‌ళ్లీ మొద‌లైంది.

పులికి ఇలా మ‌ర్యాద ఇవ్వ‌డాన్ని చాలామంది మెచ్చుకున్నారు. “ఇతర దేశాల్లో ఇలాంటివి ఎప్పుడూ చూసే ఉంటారు. ఇండియాలో అడ‌వి జంతువుల కోసం మంచిగా మారడం మంచిది” అని ఒక యూజ‌ర్ కామెంట్ చేశారు.

ఇంత‌కీ ఇది ఎక్క‌డ జరిగిందంటే? మహారాష్ట్రలోని బ్రహ్మపురి మరియు నాగభీర్ మధ్య జాతీయ రహదారి 353D ద‌గ్గ‌రంట‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి