iDreamPost

Amazon మినీ టీవీలో టాప్ వెబ్ సిరీస్ లు! ఫ్రీగా చూసేయండి!

  • Published Mar 13, 2024 | 7:41 PMUpdated Mar 13, 2024 | 7:41 PM

సబ్ స్క్రిప్షన్ లేకుండా కూడా ఓటీటీ లో ఫ్రీగా బెస్ట్ సిరీస్ లను ఎంజాయ్ చేయొచ్చు. మరి ఏ ప్లాట్ ఫార్మ్ ఈ సిరీస్ లను అందిస్తుందో.. వాటిలో బెస్ట్ సిరీస్ లు ఏవో చూసేద్దాం.

సబ్ స్క్రిప్షన్ లేకుండా కూడా ఓటీటీ లో ఫ్రీగా బెస్ట్ సిరీస్ లను ఎంజాయ్ చేయొచ్చు. మరి ఏ ప్లాట్ ఫార్మ్ ఈ సిరీస్ లను అందిస్తుందో.. వాటిలో బెస్ట్ సిరీస్ లు ఏవో చూసేద్దాం.

  • Published Mar 13, 2024 | 7:41 PMUpdated Mar 13, 2024 | 7:41 PM
Amazon మినీ టీవీలో టాప్ వెబ్ సిరీస్ లు! ఫ్రీగా చూసేయండి!

ఓటీటీలో వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ, ఓటీటీ అంటేనే సబ్ స్క్రిప్షన్ తో కూడుకున్న పని. ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నా కూడా.. వాటికీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటేనే ఆ సినిమాలను చూడగలుగుతాం. అయితే, దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఈ షబ్ స్క్రిప్షన్స్ మీద నడుస్తున్న క్రమంలో.. అమెజాన్ మినీ టీవీ మాత్రం కొన్ని క్వాలిటీ వెబ్ సిరీస్ లను ఫ్రీ గా .. ఆడియన్సుకు అందిస్తోంది. ముఖ్యంగా యూత్ కు ఇదొక మంచి ప్లాట్ ఫార్మ్. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా.. మంచి మంచి సిరీస్ లను ఎంచక్కా చూసేయొచ్చు. పైగా, యాక్షన్, డ్రామా, కామెడీ, లవ్ ఇలా అన్ని జోనర్స్ కు రిలేటెడ్ గా మంచి వెబ్ సిరీస్ లు అమెజాన్ మినీ టీవీలో అందుబాటులో ఉన్నాయి. మరి, వీటిలో చూడాల్సిన మంచి వెబ్ సిరీస్ లు చూసేద్దాం.

అయితే, అమెజాన్ మినీ టీవీని మొబైల్స్ లో, ల్యాప్ టాప్ లో , టీవీలో ఇలా అన్నిటిలోను ఫ్రీ గా చూసేయొచ్చు. ఈ ఓటీటీ లోకి వెళ్లాలంటే అమెజాన్ షాపింగ్ షాప్, వెబ్ సైట్స్ నుంచి డైరెక్ట్ గా లాగ్ ఇన్ అవ్వొచ్చు. ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా .. ఫ్రీ గా ఇందులో సినిమాలను చూసేయొచ్చు. మరి అమెజాన్ మినీ టీవిలో చూడాల్సిన సినిమాలు ఇవే..

1) హాఫ్ సీఏ:
ఈ హాఫ్ సీఏ వెబ్ సిరీస్ మినీ టీవీ రూపొందించిన వెబ్ సిరీస్. ఈ సిరీస్ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ టైటిల్ ను బట్టి చెప్పేయొచ్చు ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ కు సంబంధించిన సిరీస్ అని. దేశంలో ఎంతో కఠినమైన కోర్సుల్లో ఒకటి చార్టెడ్ అకౌంటంట్. ఈ కోర్సును చదవాలి అనుకునే వారు పడే కష్టాలు, చివరికి వారి అటెంప్ట్స్ అన్ని ముగిసాక .. అటు సీఏ కంప్లీట్ చేయలేక హాఫ్ సీఏ గా మిగిలిపోయిన వారి జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది ఈ సిరీస్.

2)హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ :
ప్రస్తుతం సొసైటీలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. ఇప్పటి రిలేషన్ షిప్స్ ను క్లియర్ గా ఈ సిరీస్ లో చూపించారు. మాన్వీ గంగ్రూ, కరణ్ వాహి నటించిన ఈ సిరీస్ .. జెన్ జీ , మిల్లీనియల్స్ కు ఖచ్చితంగా నచ్చుతుంది.రియా తన్వార్ మూడేళ్ళ పాటు రిలేషన్ షిప్ లో ఉన్నా కూడా.. తన బాయ్ ఫ్రెండ్ ప్రపోస్ చేయకపోవడంతో.. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సిరీస్ కథ.

3) హూ ఈజ్ యువర్ గైనిక్:
సాధారణంగా మహిళలు ఏజ్ పరంగా కొన్ని సెక్సువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తుంటారు. కానీ, వాటిని ఎవరు చెప్పుకోలేరు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలనుకునే 21 ఏళ్ళ యువతి.. డాక్టర్ విధూషి కొత్తార్ (సబా ఆజాద్). కొత్తగా తన ప్రాక్టీస్ ను స్టార్ట్ చేసిన యువతి ఎదుర్కొనే సిట్యుయేషన్స్ ను చాలా ఫన్నీగా చూపించారు.

4) హ్యాక్: క్రైమ్స్ ఆన్‌లైన్:
ఎథికల్ హ్యాకర్ల మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ వార్ ఈ హ్యాక్: క్రైమ్స్ ఆన్‌లైన్. రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందు .. దేశంలో తయారైన ఓ అత్యాధునిక డివైస్ మాయం కావడం, దాని ద్వారా హ్యాకర్లు ఎన్నో అరాచకాలకు పాల్పడడం.. దానికోసం సైబర్ టీం వేసే ఎత్తుగడలతో పాటు వారు ఎదుర్కున్న సవాళ్ళను ఈ సిరీస్ లో చూపించారు.

5) క్యాంపస్ బీట్స్:
కాలేజ్ లైఫ్ అందరికి ప్రత్యేకమే.. అయితే, ఓ డ్యాన్స్ అకాడెమీలోని కొందరు స్టూడెంట్స్ చుట్టూ తిరిగే.. వెబ్ సిరీస్ ఈ క్యాంపస్ బీట్స్. ఈ సిరీస్ టైటిల్ చూసే చాలా మంది ఈ సిరీస్ ను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సిరీస్ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది.

6) బడ్తమీజ్ దిల్:
ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం స్నేహంగా మారి, తర్వాత ఇద్దరు దూరమై.. మళ్ళీ వారిద్దరూ ప్రేమికులుగా ఎలా మారారు అనేదే ఈ సిరీస్ కథ. ఆ అబ్బాయి నుంచి ఆమె సిన్సియర్ లవ్ కోరుకుంటుంది. కానీ, ప్రేమ ఒకరిపై ఉన్నా కూడా అతను మాత్రం తనని అట్ట్రాక్ట్ చేసిన అందరి అమ్మయిలతో క్లోజ్ గా ఉంటాడు. వీరి ప్రేమ కథ ఎలా ఉండబోతుందో ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

చూడబోతుంటే అమెజాన్ మినీ టీవీలో ఉన్న సిరీస్ లు అన్నీ కూడా .. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్లు ఉన్నాయి. మరి, ఈ సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి