P Krishna
పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.
పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.
P Krishna
ఈ మద్య చాలా మంది జీవితంపై విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. చిన్న విషయాలకే మనస్థాపానికి గురై క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఎక్కువగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు కొంతమంది అయితే.. నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది చనిపోతున్నారు. ఇక ప్రేమ వ్యవహారాలు, పని ఒత్తిడి, అనారోగ్యం, వివాహేతర సమస్యల వల్ల పలువురు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయంతో వారి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. తాజాగా ఓ యువతి తన తండ్రి మందలించాడని దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా కేశం పేట గ్రామానికి చెందిన కే స్వామిగౌడ్, సరిత దంపతులు కొన్ని సంవత్సరాల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు రవి కుమార్, కుమార్తె దివ్య ఉన్నారు. దివ్య వయసు 21 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేసింది. రవి కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి స్వామిగౌడ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల దివ్య తాను చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం టీవీ చూడటం, ఫోన్ లో మాట్లాడటం లాంటివి చేస్తుంది. దివ్య ఉద్యోగం చేస్తుంటే.. ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటుందని భావించిన కుటుంబం ఇంట్లో కూర్చొని టీవీ, ఫోన్ చూడటానికే పరిమితం కావడంతో స్వామి గౌడ్ కుతురిని ఏదైన ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందని మందలించాడు.
తండ్రి మాటలకు దివ్య తీవ్ర మనస్థాపానికి గురైంది.. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అని దారుణమై నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ‘నాన్న నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నేను టీవీ చూడను, ఫోన్ చూడను, నేను చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఇకపై మీకు ఎలాంటి సమస్యలు ఉండవు’ అని ఒక ఉత్తరం రాసి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దివ్య రాసిన ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు చిన్న కారణంతోనే చనిపోవడంతో స్వామిగౌడ్, సరిత.. బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు.