iDreamPost

హాయిగా సాగుతున్న జీవితం.. అతను చేసిన తప్పుతో..!

ఓ మహిళా..భర్త, ఇద్దరు పిల్లలతో సంసారాన్ని హాయిగా సాగిస్తుంది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఓ వ్యక్తి చేసిన తప్పు కారణంగా ఆ మహిళ జీవితం విషాదమైంది.

ఓ మహిళా..భర్త, ఇద్దరు పిల్లలతో సంసారాన్ని హాయిగా సాగిస్తుంది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఓ వ్యక్తి చేసిన తప్పు కారణంగా ఆ మహిళ జీవితం విషాదమైంది.

హాయిగా సాగుతున్న జీవితం.. అతను చేసిన తప్పుతో..!

ప్రతి ఒక్కరు తమ సంసారం హాయిగా సాగాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు భార్త, పిల్లలలో సుఖంగా జీవించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అందుకు తగినట్లుగానే జీవితాన్ని చాలా మంది ఆడవారు సాగిస్తుంటారు. పేద కుటుంటబాలకు చెందిన దంపతులు ఇద్దరు కష్టపడి సంపాదించి..కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఇలాంటి వారి జీవితంలో కొందరు చేసే తప్పు..తీవ్ర విషాదాన్ని నింపుతుంది. తాజాగా భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఓ మహిళ జీవితంలో ఓ వ్యక్తి చేసిన తప్పు విషాదం నింపింది. ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లికి చెందిన ఒంటిపులి వెంకటలక్ష్మి(34) భర్త, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఆమెకు ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వెంకటలక్ష్మి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం కూడా గుమ్మడవల్లికి చెందిన 19 మంది కూలీ పనులు ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాసన్నగూడెంలోని నర్సరీలకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో వెంకటలక్ష్మి కూడా ఉంది. రాసన్న గూడెంలోని నర్సరీల నుంచి అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం నర్సరీలకు మామిడి మొక్కలు తరలించేందుకు కూలీ పనులకు వెళ్తుంటారు.

శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్‌ ట్రక్కులో మొక్కలు వేసుకుని తిరిగి వస్తుండగా నారంవారిగూడెం సమీపంలోని రాగానే ఘోరం చోటుచేసుకుంది. నారంవారి గూడెం సమీపంలోని అమ్మవారి దేవాలయం వద్ద వీరు ప్రయాణిస్తున్నట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ట్రక్కులోని కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అలానే  బత్తుల దుర్గయ్య అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అలానే ఈ ఘటనలో మరో  15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. కొందరు బాధితులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గయ్యకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మొత్తంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ఆస్పత్రి పాలవ్వగా, వెంకటలక్ష్మి కుటుంబంలో విషాదం నిండుకుంది. ఆమె బిడ్డలు తల్లినే వారిగా మిగిలిపోయారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరితో పాటు గాయపడిన వారంతా గుమ్మడవల్లికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబాల రోదనలు మిన్నంటాయి. గుమ్మడవల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. మరి.. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి