iDreamPost

తనకు మందు- సిగిరెట్ కావాలని భర్తను వేధిస్తున్న నవ వధువు!

తనకు మందు- సిగిరెట్ కావాలని భర్తను వేధిస్తున్న నవ వధువు!

అతనికి జరిగిన మొదటి పెళ్లి కలిసిరాలేదు. సఖ్యత కుదరక విడిపోయాడు. ఆ తర్వాత కొత్త ఆశలతో మరో పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో మరోసారి అతనికి నిరాశే ఎదురైంది. ఈసారి అతను పీకల్లోతు ఇబ్బందుల్లో పడ్డాడు. మంచి అమ్మాయి అనుకుని ఒక మాయలేడిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటకే ఆమె పెళ్లి పేరిట ముగ్గురిని మోసం చేసిందని తెలిసి నోరెళ్లబెట్టాడు. ఆమె వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామంగుండం పరిధిలో జరిగింది. రామగుండం ఎన్టీపీసీ కాలనీకి చెందిన పాన్ షాప్ నిర్వాహకుడు రేవంత్ కు గతంలో పెళ్లై విడాకులు అయ్యాయి. తర్వాత వేరే పెళ్లి చేసుకోవాలని చూశాడు. ఒక షాదీ డాట్ కామ్ లో అతనికి ఓ యువతి పరిచయం అయింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆ యువతి మాయలో రేవంత్ చాలా త్వరగా పడిపోయాడు. రేవంత్ ఇదివరకే వివాహం కావడంతో అతనికి ఎవరు ఓకే చెప్తారా అని అయోమయంలో ఉన్నాడు. తనకు ఇదే మొదటి వివాహం అంటూ సదరు యువతి నమ్మబలకింది. వీరు కొన్నాళ్లు మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత అమ్మాయి పెద్దలకు కూడా నచ్చడంతో పెద్దలు మాట్లాడుకుని వారికి వివాహం చేశారు. తీరా పెళ్లైన తర్వాత ఆమె అసలు రంగు చూపించడం ప్రారంభించింది. తనకు మందు కావాలని, సిగిరెట్లు కావాలని రేవంత్ ను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. రేవంత్ కు ఏమీ అర్థంకాక అలా ఉండిపోయాడు. ఓరోజు తన అక్క దగ్గరకు వెళ్తానంటూ ఇంట్లో ఉన్న రూ.70 వేలు నగదు, బంగారం తీసుకుని వెళ్లింది. ఎన్ని రోజులు అయినా ఆమె తిరిగి రాలేదు. ఆమె బంధులు, మిత్రులను ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. ఆ యువతికి గతంలోనే 3 పెళ్లిళ్లు అయ్యాయని తెలిసి రేవంత్ నిర్ఘాంతపోయాడు.

ఆ యువతి చిరునామా నకుక్కుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె మిత్రులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇలా ఎందుకు చేశావంటూ నిలదీయడంతో అందరూ కలిసి రేవంత్ పై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. బాధితుడు కుటుంబసభ్యులను సైతం డబ్బు కావాలని డిమాండ్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేక రేవంత్ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. ఆ యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ లో ఉందని తెలుసుకుని వెళ్లినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ బాధితుడు వేడుకుంటున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి