iDreamPost

భర్త మరణించిన రోజు వ్యవధిలోనే వివాహిత విషయంలో దారుణం!

చాలా మంది దంపతులు, తమ మధ్య ఏవైనా చిన్నపాటి గొడవలుజరిగిన కూడా సర్థుకుని పోతుంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు దంపతలు పరస్పరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ ఓ జంట విషయంలో..

చాలా మంది దంపతులు, తమ మధ్య ఏవైనా చిన్నపాటి గొడవలుజరిగిన కూడా సర్థుకుని పోతుంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు దంపతలు పరస్పరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ ఓ జంట విషయంలో..

భర్త మరణించిన రోజు వ్యవధిలోనే వివాహిత విషయంలో దారుణం!

పెళ్లి అనేది వినడానకి రెండు అక్షరాల పదమే. అయినా ఆ బంధానికి ఉండే బలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కారణం.. కష్టాసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ..సంసారాన్ని సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఏవైనా చిన్నపాటి గొడవలుజరిగిన కూడా సర్థుకుని పోతుంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు దంపతలు పరస్పరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. ఇలాంటి వారు..తమలో ఎవరికైన ఏదైనా ప్రమాదం జరిగితే అల్లాడిపోతారు. అలాంటి ఓ దంపతుల విషయంలో ఘోరం జరిగింది. ఒక రోజు వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మరణించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలో పెగడబండ తిమ్మారెడ్డి(46), సుజాత(42) దంపతులు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో వారిద్దరే జీవిస్తున్నారు. అలానే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వీరిద్దరు ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. చాలా కాలం పాటు వీరి సంసారం హాయిగా సాగుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల విధి ఆడిన వింత నాటకంలో వీరిద్దరు తనువు చాలించారు. గతనెల 13వ తేదీన తిమ్మారెడ్డికి బీపీ ఎక్కువై కిందపడిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కింద పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. కుటుంబీకులు మహబూబ్‌నగర్, అటు నుంచి హైదరాబాద్‌ తీసుకెళ్లి చికిత్స చేయించారు.

అయినా వారి ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది. తిమ్మారెడ్డి చికిత్స పొందుతూ…మంగళవారం మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకొచ్చారు. అదే  రోజు మధ్యాహ్నం తిమ్మారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబ ఆయన అంత్యక్రియ అనంతరం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇక భర్త జ్ఞాపకాలు తల్చుకుంటూ సుజాత బాధపడుతుంది. అలా బంధువులు వెళ్లిన కాసేపటికే సుజాత అకస్మాత్తుగా కుప్పకూలారు. సుజాతను గమనించిన స్థానికులు వెంటనే మరికల్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్ష చేయించగా సుజాత మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఒకరోజు వ్యవధిలోనే దంపతులు మృతి చెందటం గ్రామస్థుల్ని కలచివేసింది. వీరి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో చోటుచేసుకుంటాయి. భార్య మరణం తట్టుకోలేక మరణించిన భర్తలు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడే వారి మధ్య ఉండే ప్రేమ అనేది ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. తమ భాగస్వామికి చిన్న సమస్య వచ్చిన బాధ పడుతుంటారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు.. ఇలా మరణంలో కూడా కలిసి పోతుంటారు.  నిత్యం కీచులాడుకునే భార్యాభార్తలు ఒకవైపు కనిపిస్తుంటే.. ఇలా పరస్పరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునే వారు మరో వైపు మనకు కనిపిస్తున్నారు. మొత్తంగా తిమ్మారెడ్డి దంపతులు ఒక రోజు వ్యవధిలోనే మరణించడం అందరిని విషాదంలో నింపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి