iDreamPost

ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధం ఎఫెక్ట్ : షాక్ ఇస్తున్న బంగారం ధరలు

ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధం ఎఫెక్ట్ : షాక్ ఇస్తున్న బంగారం ధరలు

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా భారత దేశంలో బంగారం అంటే మహిళలు అమితంగా ఇష్టపడతారు. పండుగలు, వివాహాది శుభకార్యాలకు తమ స్థాయికి తగ్గట్టు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది నుంచి బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. కానీ, నెల రోజుల నుంచి దాదాపు రూ.3000 వేల వరకు బంగారం ధరలు రోజు రోజు కీ తగ్గుతూ వచ్చాయి. కానీ నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి.. దీనికి కారణంగా ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్దం కూడా ఒక కారణం అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. మంగళవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

గత నెల రోజుల నుంచి పసిడి తగ్గుతూ రావడంతో మహిళలు సంతోషంలో మునిగిపోయారు. దసరా, దీపావళి, బతుకమ్మ పండుగల సందర్భంగా తమకు కావాల్సిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపించారు. కానీ మూడు రోజుల నుంచి మళ్లీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ మద్య ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి మారణహోమం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రగిలిపోతుంది.. హమాస్ లో ఉగ్రదాడికి ప్రతిగా గజాలోని ఉగ్రమూకలపై మెరుపుదాడి చేస్తూ వారి స్థావరాలను నేలమట్టం చేస్తుంది. అయితే ఇజ్రాయెల్-పాలస్థీన దాడుల వల్ల భవిష్యత్ లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్దం కారణంగా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఆ ప్రభావం యూఎస్ ట్రెజరీస్, యుఎస్ డాలర్, గోల్డ్, జపనీస్ యెన్ లాంటి సురక్షిత పెట్టుబడులకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ కారణం తోనే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఒక శాతం పెరిగాయి..ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక నేటి బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,500 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,350 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,200 కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 కొనసాగుతుంది. బెంగుళూరు లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,200 కొనసాగుతుంది. కేరళాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. నిన్నటితో పోల్చుకుంటూ రూ.500 పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,600లుగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి రూ. 75,500 కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి