iDreamPost

భర్తపై భార్య కోపం.. నాలుగు ప్రాణాలు బలి!

నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య సహనం, ఓర్పు, సర్థుకుపోయే గుణం అనేవి తగ్గిపోతున్నాయి. ఈక్రమంలోనే వారి మధ్య జరిగే చిన్నపాటి గొడవల కారణంగా..పెద్ద ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో తన భర్తపై కోపంతో ఓ మహిళ చేసిన పనికి నాలుగు ప్రాణాలు బలయ్యాయి.

నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య సహనం, ఓర్పు, సర్థుకుపోయే గుణం అనేవి తగ్గిపోతున్నాయి. ఈక్రమంలోనే వారి మధ్య జరిగే చిన్నపాటి గొడవల కారణంగా..పెద్ద ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో తన భర్తపై కోపంతో ఓ మహిళ చేసిన పనికి నాలుగు ప్రాణాలు బలయ్యాయి.

భర్తపై భార్య కోపం.. నాలుగు ప్రాణాలు బలి!

ప్రస్తుతం సమాజంలో మనిషిలో సహనం అనేది కరువైంది.  ఎంతవెతికినా కూడా ఓర్పు, సర్ధుకోపోయే గుణం వంటి మంచి లక్షణాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవితాంతం కలిసి జీవించాల్సిన దంపతుల్లో ఈ సహనం అనేది కనుమరుగవుంది. దీని ఫలితంగా కుటుంబాల్లో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. భార్యాభర్తల కోపానికి అభంశుభం తెలియని పసిపిల్లలు బలైపోతున్నారు. తాము ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే నిండు జీవితాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ తల్లి చేసిన  పనికి ఆమెతో పాటు ముగ్గురు పసిపిల్లల ప్రాణాలు పోయాయి. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం…

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణరెడ్డిపురం గ్రామానికి చెందిన రమావత్ రవినాయక్ తన అక్క కుమార్తైన వసంతను 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి భాను ప్రకాశ్(12), ఈశ్వర్, ఉమేశ్వర్ అనే రెండున్నరేళ్ల కవలలు సంతానంగా ఉన్నారు. ఇక రవినాయక్ హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలానే ఆటో నడుపుతూ.. వారానికి ఒక్కసారి సొంతూరికి వచ్చే వెళ్తుండేవాడు. ఇదే సమయంలో రవి కుటుంబానికి అప్పులు అధికమయ్యాయి.

దీంతో వసంతకు పుట్టింవారు ఇచ్చిన ఒకటిన్నర ఎకరాల పొలం అమ్మి  అప్పులు తీరుద్దామని రవినాయక్ భావించారు. అదే విషయాన్ని వసంతకు చెప్పగా.. ఆమె ససేమిరా అన్నది. దీంతో ఇదే విషయంపై ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన అక్క సరస్వతికి చెప్పగా స్థలం విక్రయించేందుకు ఆమె కూడా ఒప్పుకోలేదు. ఇలా వారి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో ఈనెల 4న ఉదయం ఆ దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వసంత.. భర్తతోపాటు ముగ్గురు పిల్లలకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ముగ్గురు పిల్లలు పూర్తిగా టీ తాగేశారు. అయితే కొంచెం టీ తాగిన తర్వాత చేదుగా ఉందంటూ భర్త రవినాయక్ కింద పడేశారు.

ఆ తర్వాత పిల్లలతో కలిసి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే మాచర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ కూడా తాను టీలో విషం కలిపిన విషయం వసంత ఎవరీ చెప్పలేదు. ఇదే సమయంలో పిల్లల పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుడి సూచనతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తాను టీలో ఎలుకల మందు కలిపి తాగించానని ఆమె చెప్పడంతో సంబంధిత చికిత్స ప్రారంభించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఈశ్వర్‌ మృతి చెందాడు. సోమవారం మిగిలిన పిల్లలిద్దరినీ హైదరాబాద్‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో భానుప్రకాశ్‌ చనిపోయాడు.

అలానే మంగళవారం గుంటూరు ఆసుపత్రిలో తల్లి వసంత, హైదరాబాద్‌లో ఉమేశ్వర్‌ చికిత్స పొందుతూ మరణించారు.  ప్రస్తుతం రవినాయక్‌ గుంటూరులో చికిత్స పొందుతున్నారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందండంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. క్షణికావేశంలో ఓ ఇల్లాలు చేసిన పనికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి..కుటుంబాల్లో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి