iDreamPost

వీడియో: అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం.. ప్రశ్నించిన వ్యక్తిపై కర్రలతో దాడి!

నేటికాలంలో కొందరు యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే మద్యం తాగి పబ్లిక్ ప్రదేశాల్లో అతిచేష్టాలు చేస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

నేటికాలంలో కొందరు యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే మద్యం తాగి పబ్లిక్ ప్రదేశాల్లో అతిచేష్టాలు చేస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

వీడియో: అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం.. ప్రశ్నించిన వ్యక్తిపై కర్రలతో దాడి!

ఇటీవలకాలంలో ఆకతాయిల చేష్టాలు శృతిమించిపోతున్నాయి. ఇంట్లో పెద్దల భయం లేకపోవడం, తమను ఎవరు ఏమి చేస్తారులే అనే తలపొగరుతో ఇష్టాను రీతిగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు వివిధ రకాల చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే మద్యం తాగి పబ్లిక్ ప్రదేశాల్లో అతిచేష్టాలు చేస్తున్నారు. అంతేకాక ప్రశ్నించినవారిపై దాడికి తెగపడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా హత్యలకు కూడా తెగబడ్డారు. తాజాగా ఓ గంజాయి బ్యాచ్ అర్థరాత్రి వీరంగం సృష్టించింది. ప్రశ్నించిన వ్యక్తిపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శుక్రవారం హైదరాబాద్ లోని కొత్త పేట ప్రాంతంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో వీరంగం సృష్టించారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గంజాయి తాగుతున్న యువకులు కొత్తపేటలోని ఓ వీధిలో కేకలు వేస్తూ రచ్చ చేశారు. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్లాలని ఆ సమీపంలోని ఇంటి యజమాని జనార్థన్.. ఆ యువకులు చెప్పాడు. ఆయన మందలించడంతో గంజాయి మత్తులో ఉన్న ఆ గ్యాంగ్ ఒక్కసారిగా రెచ్చిపోయింది. అక్కడి నుంచి వెళ్లాలని మందలించిన జనార్దన్ మీద దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆ వ్యక్తిపై  యువకులు దాడికి దిగారు. ఇక వారి దాడిలో జనార్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. తనపై జరిగిన దాడి గురించి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి దాడులను, ఇలాంటికి పాల్పడేవారిని అరికట్టాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా తరచూ చెడు వ్యసనాలకు బానిసలు గా మారిన కొందరు యువకులు వీధుల్లో, బస్ స్టాపుల్లో రచ్చ చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసి.. కౌన్సిలింగ్స్ ఇస్తున్న కొందరి బుద్ది మారడం లేదు. అంతేకాక ఇలాంటి  ఆకతాయిల దెబ్బకు మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇలాంటి ఆకతాయిలకు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా కొత్త పేటలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి