iDreamPost

భారత్ లో ఈ ఆహారాలపై నిషేధం.. తింటే డేంజర్ లో పడినట్లే..

  • Published Jun 15, 2024 | 2:10 PMUpdated Jun 15, 2024 | 2:10 PM

Banned Foods: భారత్ దేశంలో కొన్ని రకాల ఫుడ్ ప్రొడాక్ట్స్ ను ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్స్ అసోయేషన్ (FSSAI) బ్యాన్ చేసిన విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన FSSAI ఆ ఆహారాలను బ్యాన్ చేసింది. మరి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ లిస్ట్ ఏంటి?  వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Banned Foods: భారత్ దేశంలో కొన్ని రకాల ఫుడ్ ప్రొడాక్ట్స్ ను ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్స్ అసోయేషన్ (FSSAI) బ్యాన్ చేసిన విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన FSSAI ఆ ఆహారాలను బ్యాన్ చేసింది. మరి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ లిస్ట్ ఏంటి?  వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 15, 2024 | 2:10 PMUpdated Jun 15, 2024 | 2:10 PM
భారత్ లో ఈ ఆహారాలపై నిషేధం.. తింటే డేంజర్ లో పడినట్లే..

దేశంలో ఉన్నా ఆహార ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇక్కడ  వివిధ సంస్కృతి, మతాలతో పాటు విభిన్న రుచులు కలిగిన ఫుడ్ లవర్స్ చాలామంది ఉన్నారు.  ఈ క్రమంలోనే వీరికి సంబంధించి రుచికి తగ్గట్టు ఆహార పదార్థాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ,ఈ మధ్య ఫుడ్ లవర్స్ కు.. ఎక్కడబడితే అక్కడ  ఊహించని షాక్ తగులుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన నాణ్యత లేని ఫుడ్ లు అమ్మి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న దృశ్యలు అడుగడుగున్న అద్దం పట్టినట్టు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా..  అధిక మోతాదులో ఉండే డేంజర్ రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను కూడా విక్రయిస్తున్నారు. అయితే ఇవి రుచికి బాగానే ఉండవచ్చు. కానీ, ఆరోగ్యనికి చాలా ప్రమాదకరం.

ఈ క్రమంలోనే భారత్ దేశంలో కొన్ని రకాల ఆహారాలను ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్స్ అసోయేషన్ (FSSAI) బ్యాన్ చేసింది. కానీ, ఇలా బ్యాన్ చేసిన ఫుడ్ ప్రొడాక్ట్స్  గురించి చాలామందికి తెలియదు. అయితే ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన FSSAI ఆ ఆహారాలను బ్యాన్ చేసింది. మరి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ లిస్ట్ ఏంటి?  వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనీస్ పాలు

చైనీస్ పాలు.. ఈ పాలను భారత దేశంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా టీ, కాఫీలకు కాకుండా.. వివిధ రకాల ఆహార పదార్థలు తయారు చేయడానికి కూడా ఈ పాలు ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు. కానీ, ఈ చైనీస్ పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ స్థాయిలను పెంచేలా మెలమైన్ అనే విష పూర్తి రసాయనం ఎక్కువగా ఉందని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ వాటిని బ్యాన్ చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

జన్యు పరంగా మార్పు చెందిన ఫుడ్స్

చాలా వరకు జన్యుపరంగా మార్పు చెందిన ఆహారాలను కూడా దేశంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ  బ్యాన్  చేయడం జరిగింది. అయితే బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాకుకు అనుమతి ఉన్నప్పటికీ ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ అనేది చాలా అవసరం.

పొటాషియం బ్రోమేట్ ఉన్న ఆహారాలు

దేశంలో పొటాషియం బ్రోమేట్ ఉన్న ఆహారాలను కూడా FSSAI 2016లో బ్యాన్ చేసింది. ఎందుకంటే.. పొటాషియం కలిపిన ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలోనే.. పొటాషియం బ్రోమేట్ కలిపిన బ్రెడ్ తినడం వల్ల.. థైరాయిడ్, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని  ఆ ఆహార పదార్థాలను నిషేధించారు.

పండ్లు పక్వానికి వచ్చేలా
పండ్లు పక్వాం.. ఈ ప్రక్రియ వినే ఉంటాం. ఇందులో పచ్చిగా ఉండే పండ్లను పండులాగా మార్చి అమ్మకం చేస్తుంటారు. పైగా ఇందులో క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్ గ్యాస్ వంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పండ్లు తినడం వల్ల క్యాన్సర్, జీర్ణ సమస్యలు, ధీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వీటిని బ్యాన్ చేశారు. ఇవే కాకుండా.. వీటితో పాటు చైనీస్ వెల్లుల్లి, రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్, సస్సాఫ్రాస్ ఆయిల్‌, కుందేలు మాంసంపై కూడా FSSAI నిషేధం విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి