iDreamPost

మా బిడ్డకు ప్రాణం పోసిన దేవుడు జగనన్న.. భావోద్వేగానికి లోనైనా దంపతులు!

మా బిడ్డకు ప్రాణం పోసిన దేవుడు జగనన్న.. భావోద్వేగానికి లోనైనా దంపతులు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పేద ప్రజల కోసం విద్యా, వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. గతంలో ఉన్నవి కాకుండా అదనంగా మరికొన్ని వ్యాధులను ఆరోగ్య శ్రీ కింద చేర్చి.. పేద వారికి మరింత భరోసా కల్పించారు. ఇలా ఆరోగ్య శ్రీ ద్వారా పేద వారికి ఉచిత వైద్యం అందిస్తూ.. మరో వైపు సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది  పేద కుటుంబాలను సీఎం ఆందుకున్నారు. ఎంతో మందికి ప్రాణం పోసి దేవుడిగా సీఎం జగన్ మారారు.  తమ పాపకు ప్రాణం పోసిన దేవుడు జగనన్న అంటూ ఓ గిరిజన కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ఈ ఘటన పాయకరావుపేట నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు  కైలాసపట్నంలోని  రాజగోపాల పురంలో పర్యటించారు. ఈ  సందర్భంగా ఓ గిరిజన ఇంటిని ఎమ్మెల్యే సందర్శించారు. ఆ సమయంలో నిఖిత అనే పాప కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అలానే  సీఎం జగన్ పై  తమకు ఉన్న అంతులేని అభిమానాన్ని వ్యక్త పరిచారు. “మా పాపకు ప్రాణం పోసిన  దేవుడు జగనన్న.. వైద్యం కోసం సాయం అడగ్గానే దేవుడిలా అభయం ఇచ్చారు. మా బిడ్డను జగనన్న హత్తుకుని నేనున్నానంటూ  ఇచ్చిన భరోసాను జీవితంలో మరిచిపోలేం. మా బిడ్డకు దేవుడిచ్చిన మేనమామ జగనన్న” అంటూ ఆ గిరిజన కుటుంబం ఉద్వేగానికి లోనైంది.

రాజగోపాలపురానికి చెందిన బొండపల్లి చంటి, వేణమ్మ దంపతులకు శ్రీ వెంకట నిఖిత అనే కుమార్తె ఉంది. ఈ పాప లివర్ సంబంధిత వ్యాథితో చాలా కాలం నుంచి బాధ పడుతోంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్.. నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభకు రాగా.. తమ కుమార్తెను ఆదుకోవాలని ఆ పాప తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎం జగన్ .. ఆ పాపకు చికిత్స అందిచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం హైదరాబాద్ లోని జీవన్ ధార్ ఆస్పత్రిలో  రిజిస్ట్రేష్ చేయించినట్లు పాప తల్లిదండ్రులు తెలిపారు.

లివర్ మార్పిడి కోసం దాత లభించిన వెంటనే చికిత్స  అందించనున్నట్లు వారు తెలిపారు. దాత కోసం ఎదురుచూస్తున్నామని, ముఖ్యమంత్రి జగనన్న చేసిన సాయం జీవితంలో ఎన్నటికి మరిచిపోమన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్య నారాయణ రాజు తదితర నాయకులకు ఆ పాప కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. మరి.. ఇలా సీఎం జగన్.. పేద కుటుంబాలను ఆదుకుంటున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి