iDreamPost

UPSC అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక ఏర్పాట్లు!

TGS RTC: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రత్యేక సందర్భాలను బట్టీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

TGS RTC: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రత్యేక సందర్భాలను బట్టీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా యూపీఎస్సీ పరీక్షలు రాసే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

UPSC అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక ఏర్పాట్లు!

తెలంగాణ ఆర్టీసీ తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రత్యేక సందర్భాలను టైమ్ లో అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాక వివిధ రకాల పరీక్షలు రాసే వారి సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటుంది. గతంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల కోసం పరీక్ష సమయంలో ఫ్రీ జర్నీని అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అలానే తాజాగా ఇతర ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తూ.. ప్రయాణికులకు సౌకర్యాలను కల్పిస్తుంది. తాజాగా యూపీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఏటా సివిల్స్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. అలానే ఈ ఏడాది కూడా యూపీఎస్ఈ  పరీక్షలు నిర్వహించనుంది. అందులో భాగంగా జూన్ 16న ఆదివారం దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 80 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక సివిల్ సర్వీస్ యూపీఎస్‌ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, హన్మకొండ ప్రాంతాల్లోనే ఈ పరీక్ష జరగనుంది. యూపీఎస్సీ జనరల్ స్టడీ పేపర్-1 ఉదయం 9.30 నుంటి 11.30 వరకు జరగనుంది. అలానే జనరల్ స్టడీ పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ కేంద్రాల్లోకి అభ్యర్థులు చేరే విధంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

యూపీఎస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. బస్సులు  వివిధ బస్ స్టాప్‌ల నుంచి కేంద్రాలకు చేరుకునేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థుల కోసం వారి బస్సులకు మార్గనిర్దేశం చేసేందుకు సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని కోఠి, రైతిఫిల్ బస్ స్టేషన్ లలో  కమ్యూనికేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోఠి: 9959226160, రైతిఫైల్ బస్ స్టేషన్: 9959226154 నెంబర్లకు ఫోన్ చేసి..బస్ వివరాలను తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి