iDreamPost

Tenali Incident: గీతాంజలి మృతిపై స్పందించిన భర్త! అర్థరాత్రి లేచి ఏడుస్తుండేది అంటూ!

టీడీపీ శ్రేణుల ట్రోలింగ్స్ కారణంగా గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసభ్యకరమైన కామెంట్స్ తనపై ట్రోల్స్ రావడంతో మానసిక వేదనకు గురై.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాజాగా గీతాంజలి భర్త కీలక విషయాలను వెల్లడించారు.

టీడీపీ శ్రేణుల ట్రోలింగ్స్ కారణంగా గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసభ్యకరమైన కామెంట్స్ తనపై ట్రోల్స్ రావడంతో మానసిక వేదనకు గురై.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాజాగా గీతాంజలి భర్త కీలక విషయాలను వెల్లడించారు.

Tenali Incident: గీతాంజలి మృతిపై  స్పందించిన భర్త! అర్థరాత్రి లేచి ఏడుస్తుండేది అంటూ!

టీడీపీ, జనసేన నేతల ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి(28) అనే మహిళా ఆత్మహత్య చేసకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం ద్వారా తాను పొందిన లబ్ధి గురించి చెప్పడమే  ఆమె చేసిన నేరమైంది. గీతాంజలి చెప్పిన మాటలపై టీడీపీ,జనసేన శ్రేణులు దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మానసికంగా హింసించి.. చివరకు ఆమె మరణానికి కారణమయ్యారు. తాజాగా గీతాంజలి మృతిపై ఆమె భర్త బాలచందర్ సంచలన విషయాలను చెప్పారు.

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన  గీతాంజలి అనే పేదింటి మహిళ టీడీపీ శ్రేణులు చేసిన ట్రోల్స్ కారణంగా తీవ్ర వేదనకు గురై.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.  గీతాంజలి మరణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. జగన్‌ ప్రభుత్వం తనకు ఇంటి పట్టా అందించిందనే వార్తను పంచుకుంటూ.. వైసీపీ ప్రభుత్వం వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు వివరిస్తూ.. కృతజ్ఞతలు చెప్పింది గీతాంజలి. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. వారి టార్చర్ తట్టుకోలేక గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది. గీతాంజలి బిడ్డలు తల్లిలేని పిల్లలయ్యారు. వారు తన తల్లి మృతదేహం ముందు ఏడుస్తున్న దృశ్యాలు అందరి హృదయాలను బరువెక్కించాయి. గీతాజంలి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళపై ట్రోల్స్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

తాజాగా గీతాంజలి మృతిపై ఆమె భర్త బాల చందర్ స్పందించారు. గీతాంజలి మరణంకు సంబంధించి కీలక విషయాలను తెలిపారు. ఇంటి పట్టాల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన నెగిటివ్ ట్రోలింగ్స్ ను తన భార్య చెప్పలేదని బాల చందర్ తెలిపారు. ఆమె  మంచి కామెంట్స్ గురించే మాత్రమే తమకు చెప్పేదని అన్నారు. అలానే నెగిటీవ్ కామెంట్స్ గురించి తమకు చెప్పలేదని ఆయన తెలిపారు. పలు సందర్భాల్లో అర్థరాత్రి లేచి  ఏడుస్తుండేదని, చివరకు తెనాలి రైల్వే స్టేషన్ కు వెళ్లాక గీతాంజలి ఫోన్ చేసిందని బాల చందర్ అన్నారు. ఎక్కడుందో తెలుసుకునే లోపే  ఘోరం జరిగిపోయిందని వెల్లడించారు.

ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది. అలానే తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో మీడియా ముందు తెలిపింది. తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యింది. ఇక ప్రభుత్వాన్ని పొగట్టం గిట్టని టీడీపీ,జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు. ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు. టీడీపీ కాలకేయ సైన్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదటలు పెట్టారు. ఆమె శరీరాన్ని, ఆమె మాటల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు. అర్థరాత్రుళ్లు ఫోన్లు చేసి వేధించారు. చివరకు తమ ట్రోలింగ్ కారణంగా ఆ నిండు ప్రాణం బలైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి