Revanth Reddy: ఇకపై విద్యార్థులు డ్రగ్స్ తో దొరికితే.. ఊహించని శిక్ష! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

TG Govt-Admission Of Students, Drugs: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాంటి విద్యార్థుల అడ్మిషన్‌ని రద్దు చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

TG Govt-Admission Of Students, Drugs: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాంటి విద్యార్థుల అడ్మిషన్‌ని రద్దు చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ముందుకు సాగుతుంది. ఎన్నికల్లో వచ్చిన హామీలనే కాక.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. అంతేకాక సమాజంలో పాతుకుపోయిన కొన్ని దురలవాట్లను వేళ్లతో సహా పెకిలించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై అలాంటి విద్యార్థుల అడ్మిషన్‌ రద్దు చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మత్తు పదార్థాల కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌ చేస్తామని ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీసులు ఓ వింగ్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం మన సమాజంలో మత్తు పదార్థాలకు అలవాటుపడుతూ.. వాటికి బానిసలుగా మారుతున్న వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విరివిగా దొరుకుతున్నాయి. తాత్కాలిక ఆనందాల కోసం విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఇక మీదట తెలంగాణలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్‌తో పట్టుబడితే వారి కాలేజీ అడ్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే స్టూడెంట్స్ డ్రగ్స్ జోలికి వెళ్లరని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ నివారణపై రాష్ట్ర డీజీపీ, విద్యాశాఖాధికారులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు త్వరలోనే సమావేశం కానున్నారు. దీనిలో డ్రగ్స్ కంట్రోల్ చేయటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులు అడ్మిషన్లు రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఇక మత్తు పదార్థాల నియంత్రణకు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 డిఅడిక్షన్ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డిఅడిక్షన్ సెంటర్లు మూతపడినట్లు నార్కోటిక్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం మత్తుకు బానిసలు అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ వాటిని యాక్టివ్ చేసేందుకు నార్కోటిక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 16 డిఅడిక్షన్ సెంటర్లలో 11 కేంద్రాల్లో మత్తుకు బానిసలైన బాధితులు చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో డిఅడిషన్ సెంటర్లు ఉన్నప్పటికీ అవి పని చేయటం లేదని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి మత్తుకు బానిసలైన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది.

Show comments