Students Emotional: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు.. ప్లీజ్ వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు!

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు.. ప్లీజ్ వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు!

Students Emotional: గురువు అంటే దైవంతో సమానం.. అందుకే గురువును త్రిమూర్తులతో పోల్చుతారు. విద్యార్థులకు చక్కటి విద్యాబుద్దులు నేర్పించే గురువు తన శిష్యుడు తనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని నిస్వార్థంగా కోరుకుంటారు.

Students Emotional: గురువు అంటే దైవంతో సమానం.. అందుకే గురువును త్రిమూర్తులతో పోల్చుతారు. విద్యార్థులకు చక్కటి విద్యాబుద్దులు నేర్పించే గురువు తన శిష్యుడు తనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని నిస్వార్థంగా కోరుకుంటారు.

సమాజంలో గురువుకు ఎంత గొప్ప స్థానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతారు. సమాజంలో గొప్ప స్థానంలో ఉండేలా కృషి చేస్తారు. అందుకే గురు బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరభ్రమ్మ, తస్మైశ్రీ గురవే నమః అంటూ దైవంతో పోల్చుతారు. గురుశిష్యుల అనుబంధం ఎంతో గొప్పది. తమకు విద్యాబుద్దలు, క్రమశిక్షణ నేర్పించిన గురువులను విద్యార్థులు ఎంతో గౌరవిస్తారు.. వాళ్లను గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వారు బదిలీపై వెళ్తుంటే గుండెలు పగిలేలా రోదిస్తుంటారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హృదయాలు కదిలించే సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిరోజూ తమకు విద్యా బుద్దులు నేర్పి..  అన్నీ తానై ఉంటూ ప్రేమను పంచిన ఉపాధ్యాయురాలు బదిలీపై వెళుతుంటే.. ఆ విద్యార్థులు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. నిస్వార్థమైన ఆమె సేవలు గుర్తుంచుకున్న విద్యార్థులు ప్లీజ్ మేడం వెళ్లకండీ అంటూ ప్రాదేయపడ్డారు. మేకల జ్యోతిరాణి అనే ఉపాధ్యాయురాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 11 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 19వ తేదీన జ్యోతిరాణి కి ప్రమోషన్ వచ్చింది. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలిగా ప్రమోషన్ లభిచింది. ఈ క్రమంలోనే ఆమెకు పాఠశాలలో రిలీవ్ వీడ్కోలు ఏర్పాటు చేశారు.

2013 నుంచి పాఠశాలకు మంచి పేరు తీసుకు వచ్చిన ఆమెను సహ ఉపాధ్యాయులు ఎంతో గొప్పగా కొనియాడారు. తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఇక విద్యార్థులు అయితే మేడం చుట్టూ చేరి ప్లీజ్ మేడం మమ్ముల్ని విడిచి వెళ్లొద్దు, మీరు లేకుంటే ఈ స్కూల్ కి మేం రాం అంటూ ఏడ్చారు. వారి ప్రేమను చూసి జ్యోతిరాణి కూడా ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లిలో కార్పోరేట్ స్కూల్స్ పదుల సంఖ్యల్లో ఉన్నప్పటికీ 8 మంది ఉన్న పాఠశాలను 120 కి ప్రవేశాలు పెంచి కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు జ్యోతిరాణి. అందుకే ఆమె అంటే గ్రామస్థులు కూడా ఎంతో అభిమానం చూపించేవారని సహ ఉపాధ్యాయులు అంటున్నారు.

 

Show comments