Siddipet: IITలో చేరాలనే విద్యార్థి కల సాకారం చేసిన కలెక్టర్

IITలో చేరాలనే విద్యార్థి కల సాకారం చేసిన కలెక్టర్

Siddipet: సరస్వతి కటాక్షం ఉన్నా కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యనభ్యసించలేకపోతుంటారు. అలాంటి వారి కష్టాలు గుర్తించి కొంతమంది సహృదయంతో చదువులకు ఖర్చులు భరించి వారి కల సాకారం చేస్తుంటారు.

Siddipet: సరస్వతి కటాక్షం ఉన్నా కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యనభ్యసించలేకపోతుంటారు. అలాంటి వారి కష్టాలు గుర్తించి కొంతమంది సహృదయంతో చదువులకు ఖర్చులు భరించి వారి కల సాకారం చేస్తుంటారు.

నేటి సమాజంలో ఉన్నత విద్య ఉంటేనే ఉన్నత ఉద్యోగాలు వస్తాయి.. సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉంటారు. అందుకే తల్లిదండ్రులు తమ శక్తికి మించిన ఖర్చు అయినా సరే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొంతమంది పేద విద్యార్థులు మద్యలోనే పులిస్టాప్ పెట్టేస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తల్లి అండతో సోషల్ వెల్పేర్ విద్యా సంస్థల్లో చేరి, చిన్నతనం నుంచి బాగా చదువుతూ ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించాడు. ఐఐటీ అంటే ఖర్చుతో కూడుకున్న విషయం.. అలాంటి సమయంలోనే నేనున్నా అంటూ ఆ విద్యార్థికి అండగా నిలిచారు ఓ కలెక్టర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరెకొమ్ముల గ్రామానికి చెందిన బి ఆర్యన్ రోషన్ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు.చిన్నతనం నుంచి చదువుల్లో రాణిస్తూ పదవ తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్ లో 93.69 శాతం మార్కులు తెచ్చుకొని.. జేఈఈ ర్యాంక్ ద్వారా దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించాడు. అంతా బాగానే ఉన్న ఆర్యన్ కి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ వచ్చాయి.. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితి. ఈ విషయంపై వార్తా కథనాలు రావడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పందించారు. అలాంటి సరస్వతి పుత్రుడు గొప్ప చదువులు చదవాలని ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఆర్యన్ ని కలెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు. చదువుపై ఉన్న ఆసక్తి గురించి అడిగి తెలుసుకున్నారు.. భవిష్యత్ లో ఇంకా బాగా రాణించాలని ప్రోత్సహించారు. ఆర్యన్ రోషన్ సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు. అంతేకాదు అతని చదువుల అవసరాల కోసం రూ.40,500 విలువైన ల్యాప్ ట్యాప్ ని కొనిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ..‘ఆర్యన్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి రాజమణితో కలిసి కూలీ పనులు చేస్తూ చదువుతూ తనలోని ప్రతిభను చూపించాడు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సాధించాడు. అలాంటి మట్టిలో మాణిక్యం మరింత గొప్ప చదువులు చదవాలనే ఉద్దేశంతో ఆర్యన్ కి అభినందలు తెలిపి అతన్ని ప్రోత్సహించాను. ఐఐటీ పూర్తి చేసుకొని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తునాను.. ఇలాంటి విద్యార్థులు మరెంతోమంద పేద విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.

Show comments