Dharani
మూఢనమ్మాకలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులే.. ఏకంగా యూనిఫామ్‌లో ఉండి మరీ మూఢనమ్మకాలను పాటించడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..
మూఢనమ్మాకలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులే.. ఏకంగా యూనిఫామ్‌లో ఉండి మరీ మూఢనమ్మకాలను పాటించడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలు..
Dharani
అనాదిగా మన సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు కొనసాగుతూ వస్తున్నాయి. వాటి వల్ల ఎందరో అమాయకులు ప్రాణాలు పొగొట్టుకున్నారు.. ఇంకా పొగొట్టుకుంటూనే ఉన్నారు. అక్షరాస్యత పెరిగినా.. అంతరిక్షంలోకి దూసుకెళ్లినా సరే.. సమాజంలో వేళ్లూనికుని పోయి ఉన్న కొన్ని నమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నారు. బాణామతి, చేతబడి, క్షుద్రపూజలు వంటి వాటి పేరుతో ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఇక తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన నెట్టింట వైరల్‌గా మారిది. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన పోలీసులే.. యూనిఫామ్‌లో ఉండి మరీ వాటిని పాటించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులో ప్రతి ఏటా రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. గుట్టపై వెలిసిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెరువు గట్టు క్షేత్రంలో అగ్ని గుండాలు నిర్వహిస్తారు. అయితే ఇలా అగ్నిగుండాల్లో నడవడం వల్ల ప్రమాదాలు జరగడం మాత్రమే కాక.. గాయపడతారు కూడా. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు అయితే ఇలాంటి నమ్మకాలు పాటించడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కనుక చాలా మంది నిపుణులు, వైద్యులు.. ఇలాంటి మూఢనమ్మకాలను పాటించవద్దని కోరతారు. కానీ చెరువుగట్టులో మాత్రం ఇందుకు భిన్నమైన సంఘటన వెలుగు చూసింది. నిప్పుల గుండంలో నడిస్తే ప్రమాదం అని ప్రజలను హెచ్చరించాల్సిన పోలీసులే.. స్వయంగా నిప్పుల గుండంలో నడిచారు. అది కూడా యూనిఫామ్‌లో ఉండి ఇలా నిప్పుల గుండంలో నడవడం వివాదాస్పదంగా మారింది. వారు భక్తి కొద్దే ఇలా చేశారనుకుందాం.
కానీ నిప్పుల గుండం తొక్కడం అనేది మూఢనమ్మకం. అలాంటి వాటిని పోలీసులే ఎంకరేజ్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అంతేకాక సదరు పోలీసులు వారి కుటుంబంతో కలిసి.. సివిల్ డ్రస్‌లో వచ్చి ఇలాంటి వాటిని ఫాలో అయితే ఓకే.. అది వారి వ్యక్తిగతం. కానీ ప్రజలకు మార్గదర్శకులుగా ఉండే పోలీస్ జాబ్‌లో ఉంటూ.. యూనిఫామ్‌లో ఇలాంటి పనులను చేయడాన్ని మాత్రం విమర్శిస్తున్నారు.
మూఢనమ్మకాల పై అవగాహన కల్పించాల్సిన పోలీసులే చెరువుగట్టు జాతరలో నిప్పులపై నడిచారు. pic.twitter.com/HAElQmlDhZ
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2024