Uppula Naresh
వికారాబాద్ జిల్లాకు చెందిన ఫౌజియా అనే యువతి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన ఫౌజియా అనే యువతి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు.
Uppula Naresh
వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఫౌజియా ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమించడంంతో ఆమె శనివారం ఉదయం 11 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కానిస్టేబుల్ మృతితో పోలీస్ శాఖ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆస్పత్రికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. అయితే ఫౌజియా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సమాచారం. కానిస్టేబుల్ మృతితో ఆమె తల్లిదండ్రులు. ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణ్ పూర్ కు చెందిన ఫౌజియా (26) సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2023 అక్టోబర్ 15న ఫౌజియా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిచారు. ఆమె ఇన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే రోజు రోజు ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించింది. దీంతో చికిత్స పొందుతూ నవంబర్ 11న ఉదయం 11 గంటలకు కానిస్టేబుల్ ఫౌజియా ప్రాణాలు విడిచింది. ఆమె ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆమె మృతి పట్ల కొల్లూరు స్టేషన్ సిబ్బంది కన్నీరు మున్నీరుగా విలించారు. ఇక ఫౌజియా మృతిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లారు. ఫౌజియా మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, మహిళా కానిస్టేబుల్ ఫౌజియా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంతో చలాకిగా ఉండే ఫౌజియా చిన్న వయసులోనే చనిపోవడంతో గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మహిళా కానిస్టేబుల్ మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.