Zaheer Khan: జహీర్ ఖాన్ విధ్వంసానికి 23 ఏళ్లు.. బౌలింగ్ లో కాదు, బ్యాటింగ్ లో!

Zaheer Khan: జహీర్ ఖాన్ విధ్వంసానికి 23 ఏళ్లు.. బౌలింగ్ లో కాదు, బ్యాటింగ్ లో!

  • Author Soma Sekhar Updated - 10:10 AM, Sun - 10 December 23

టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ తనలో ఓ విధ్వంసకర బ్యాటర్ ఉన్నాడని 23 ఏళ్ల క్రితం ఇదే రోజున(డిసెంబర్ 8, 2000) ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ తుపాన్ ఇన్నింగ్స్ పై ఓ లుక్కేద్దాం.

టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ తనలో ఓ విధ్వంసకర బ్యాటర్ ఉన్నాడని 23 ఏళ్ల క్రితం ఇదే రోజున(డిసెంబర్ 8, 2000) ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ తుపాన్ ఇన్నింగ్స్ పై ఓ లుక్కేద్దాం.

  • Author Soma Sekhar Updated - 10:10 AM, Sun - 10 December 23

జహీర్ ఖాన్.. టీమిండియా దిగ్గజ బౌలర్ గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను కట్టబెట్టాడు. తన పదునైన స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముపుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంలో సిద్ధహస్తుడు. అయితే చాలా మందికి జహీర్ బౌలర్ గా సాధించిన ఘనతల గురించి మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ జహీర్ లో ఓ విధ్వంసకర బ్యాటర్ ఉన్నాడని కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే ప్రపంచానికి తెలియజేశాడు. జింబాబ్వే తో ఇదే రోజు(డిసెంబర్ 8, 2000)న జరిగిన మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో జింబాబ్వే బౌలర్ ఓలొంగా కు తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించాడు. 23 ఏళ్ల జహీర్ విధ్వంసంపై ఓ లుక్కేద్దాం.

అది 2000 సంవత్సరం ఇదే రోజు(డిసెంబర్ 8) జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలొంగాకు పీడకలను మిగిల్చాడు టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా 3వ వన్డేలో రెచ్చిపోయి ఆడాడు టీమిండియా స్టార్ బౌలర్ జహీర్. అప్పటి వరకు తనలో ఫాస్ట్ బౌలరే ఉన్నాడని ఈ ప్రపంచం భావించిన తరుణంలో.. తనలో భీకర బ్యాటర్ కూడా ఉన్నాడని ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచ క్రికెట్ కు తెలియజేశాడు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలొంగా చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు.

ఈ క్రమంలోనే తొలి రెండు బంతులకు రెండే పరుగుల ఇచ్చాడు ఒలొంగా. ఇక మూడో బంతి నుంచి బౌలర్ కు చుక్కలు చూపించాడు. మిగిలిన నాలుగు బంతులను వరుసగా 6,6,6,6 గా బాది విధ్వంసం సృష్టించాడు. దీంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 283 పరుగులు చేసింది. కేవలం 11 బంతుల్లోనే 32 పరుగులు చేసి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నేటితో ఈ థండర్ ఇన్నింగ్స్ కు 23 ఏళ్లు. దీంతో అభిమానులు జహీర్ బ్యాటింగ్ ను గుర్తుచేసుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 146 పరుగులతో భారీ శతకం సాధించాడు. మరి జహీర్ విధ్వంసకర బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments