బయోపిక్ తీయడానికి అదే రీజన్.. వాళ్లకు నా మూవీ అంకితం: యువరాజ్

Yuvraj Singh Reaction On Biopic: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ బయోపిక్ ఎందుకు తీస్తున్నారో క్లారిటీ ఇచ్చాడు యువీ.

Yuvraj Singh Reaction On Biopic: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ బయోపిక్ ఎందుకు తీస్తున్నారో క్లారిటీ ఇచ్చాడు యువీ.

సినీ తారలు, పొలిటీషియన్స్, క్రికెట్ స్టార్స్ లైఫ్ ఆధారంగా బయోపిక్స్ తీయడం తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్​లో ఇవి విరివిగా వచ్చేవి. ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలు కూడా మంచి బయోపిక్స్ తీస్తూ ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేస్తున్నాయి. సెలెబ్రిటీలు వాళ్ల లైఫ్​లో పడిన స్ట్రగుల్స్, కష్టాలను నిచ్చెనగా వేసుకొని సక్సెస్​ను అందుకున్న తీరును ఎక్కువగా ఇలాంటి ఫిల్మ్స్​లో ప్రొజెక్ట్ చేస్తుంటారు. జీరో నుంచి హీరోగా సాగిన ప్రయాణాన్ని చూపిస్తారు. ఇప్పుడు మరో బయోపిక్​కు టైమ్ వచ్చేసింది. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందనుంది. దీనిపై ఇవాళ అధికారిక ప్రకటన వచ్చింది. యువీ బయోపిక్​ను తీయనున్నట్లు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్, రవిభాగ్ చందన్ వెల్లడించారు.

భారత్​కు యువీ రెండు వరల్డ్ కప్​లు అందించడం, క్యాన్సర్​తో పోరాడుతూనే టీమ్​ను ఛాంపియన్​గా నిలబెట్టడం, క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కమ్​బ్యాక్ ఇచ్చిన తీరు లాంటివి బయోపిక్​లో చూపించే అవకాశం ఉంది. దీంతో ఈ బయోపిక్​లో యువీ రోల్​లో ఎవరు కనిపిస్తారు? హీరోయిన్​గా ఎవరు యాక్ట్ చేస్తారు? అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అదే టైమ్ ఈ బయోపిక్​లో ఏ విషయాన్ని హైలైట్ చేస్తారు? అనేది కనుక్కునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో యువరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిత్యం సవాళ్లు ఎదుర్కొంటూ తమ కలల్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నామని అన్నాడు. వాళ్ల కోసమే ఈ బయోపిక్ తీస్తున్నామని చెప్పాడు. వరల్డ్ వైడ్​గా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్​కు తన స్టోరీ చెప్పేందుకు ఆసక్తిగా ఉన్నానని, ఇది ఎంతో గౌరవమని తెలిపాడు.

‘విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా జీవిత కథను చెప్పనుండటం గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్​ను ఎప్పుడూ ప్రేమిస్తూనే వచ్చా. ఎన్ని ఎత్తుపళ్లాలు, ఓటములు ఎదురైనా గేమ్​ మీద నాకు ఉన్న ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు. తమ డ్రీమ్ కోసం నిత్యం కష్టపడే వారికి ఈ సినిమా స్ఫూర్తిని ఇస్తుందని భావిస్తున్నా. కలలను అందుకునేందుకు పరితపించే వారిని ఈ ఫిల్మ్ ఇన్​స్పైర్ చేస్తుందని ఆశిస్తున్నా’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక, ఈ బయోపిక్​లో యువీని హీరోగా చూపిస్తే, మరి విలన్​గా ఎవర్ని చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. విలన్​గా ఎంఎస్ ధోనీని చూపిస్తారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. తొలుత జట్టులోకి వచ్చిన యువరాజ్​ను కాదని ధోనీని కెప్టెన్ చేశారని చెబుతున్నారు. అలా పలు సందర్భాల్లో అతడికి అన్యాయం చేశారని.. కాబట్టి మాహీని ప్రతినాయకుడిగా చూపిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏదీ చెప్పలేం. మరి.. యువరాజ్ బయోపిక్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments