SNP
SNP
మరికొన్ని రోజుల్లోనే ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుట్‌వేర్ అండ్ స్పోర్ట్స్‌వేర్ బ్రాడ్ కంపెనీ పుమా తమ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రయోషనల్ యాడ్‌ను రూపొందించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పుమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా యాడ్ షూట్‌లో భాగంగా కోహ్లీ డైవ్ చూస్తూ బాల్ అందుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఏదైనా డైవ్‌ను క్యాప్చర్ చేసి #PUMADive హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేస్తే.. బెస్ట్ డైవ్‌ను సెలెక్ట్ చేసి బహుమతులు ఇస్తామని పుమా కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీతో క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కుతుందని తెలిపింది.
ఈ యాడ్ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ.. పుమా యాడ్ షూట్‌కు సంబంధించిన డైవ్ ఫొటోను షేర్ చేసి.. ఇది కచ్చితంగా పుమా డైవే. మరి మీరేమంటారు? అని ప్రశ్నించాడు. దీంతో ఈ యాడ్‌పై తొలుత సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ స్పందించారు. ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. జాంటీ ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ రోజుల్లోనే కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఎంతో మంది యువ క్రికెటర్లకు ఫీల్డింగ్‌లో స్ఫూర్తిగా నిలిచాడు. అయితే.. కోహ్లీ యాడ్ ఫొటోపై జాంటీ రోడ్స్ స్పందింస్తూ తన ఫీల్డింగ్ విన్యాసానికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.
‘కోహ్లీ.. ఇది అద్భుతం. అయితే నేను కూడా ఇలాంటి ఫీల్డింగ్ ఫీట్లు చేశాను. ప్రత్యేక జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఇది మంచి ప్రయత్నం. ఈ ఏడాది నువ్వు ఇలాంటి ఫీట్స్ సాధిస్తావని ఆశిస్తున్నా. అయితే మా సౌతాఫ్రికాపై మాత్రం చేయకు’ అంటూ జాంటీ సరదాగా చెప్పుకొచ్చారు. జాంటీ షేర్ చేసిన ఫొటోపై మన టీమిండియా దిగ్గజ మాజీ ఆల్‌రౌండర్, వరల్డ్ కప్స్ హీరో యువరాజ్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. జాంటీ రోడ్స్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ది లెజెండ్ జాంటీ సింగ్.. డైవ్ ఎలా చేయాలో మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను’ అంటూ తన డైవ్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ఈ డైవ్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Think this definitely is a 💯% score. What do you guys think? 🤔 #PUMADive #ad https://t.co/EpbKKEQ5uu pic.twitter.com/kbexIug4Pz
— Virat Kohli (@imVkohli) September 29, 2023
Nice one, @imVkohli ! It all started with a dive for me too. Reminiscing some special memories. Hope you make some this year. Not against us though 😉 #PUMADive https://t.co/i1dkj2FKoZ pic.twitter.com/vQC56aUTzN
— Jonty Rhodes (@JontyRhodes8) September 29, 2023
the legend Jonty Singh @JontyRhodes8 . Learnt a dive or two from you growing up 😉 #PUMADive https://t.co/hMb1xOzaCp pic.twitter.com/HwRdvBzOpZ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 30, 2023
ఇదీ చదవండి: ఆ టీమిండియా బ్యాటర్ కు బౌలింగ్ చేయాలంటే నాకు భయం: డేల్ స్టెయిన్