IPL 2024: వైజాగ్‌లో CSK మ్యాచ్‌.. అందుబాటులోకి టిక్కెట్లు.. ధరలు ఇవే!

ఐపీఎల్ సీజన్ 17 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు జరగ్గా.. క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. అలానే నేడు కూడా మరో రెండు మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇది ఇలాంటే క్రికెట్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఐపీఎల్ సీజన్ 17 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు జరగ్గా.. క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. అలానే నేడు కూడా మరో రెండు మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇది ఇలాంటే క్రికెట్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికే మూడో మ్యాచ్ లను పూర్తి చేసుకుంది. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్  ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారికి నెల రోజుల పాటు పండగే అని చెప్పాలి. ఇక ఐపీఎల్ మ్యాచ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అలానే ఏపీలో కూడా కొన్ని మ్యాచ్ లు ఉన్నాయి. నేఫథ్యంలోనే క్రికెట్ ప్రియులకు సంబంధించి ఓ శుభవార్త బయటకు వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో సీఎస్కే విజయం సాధించింది. ఇలానే నిన్న కూడా రెండు మ్యాచ్ లు జరిగాయి. ఇలా ఐపీఎల్ మ్యాచ్ లతో క్రికెట్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఎంతో మంది ప్రత్యక్షంగా మ్యాచ్ లు చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో తరువాత జరగబోయే మ్యాచ్ ల టికెట్ల విక్రయం గురించి ఎంతగానే ఎదురు చూస్తుంటారు.

ఐపీఎల్ సీజన్ 17 లో విశాఖ వేదికగా రెండు మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ రెండు మ్యాచ్ లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా మార్చి 31, ఏప్రిల్ 3న మ్యాచ్‌లు జరగున్నాయి. ఏప్రిల్‌ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ టిక్కెట్ల విక్రయం పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆదివారం నుంచి చేపట్టనున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం వెల్లడించింది.

అదే విధంగా మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు టికెట్ల అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇక టికెట్ల ధరల విషయానికి వస్తే… కనిష్ఠంగా రూ.1,000 నుంచి ఉంది.  ఆ తరువాత రూ.1500, రూ.2వేలు, రూ.3 వేలు, రూ.3,500, రూ.5 వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కాగా, ఆన్‌లైన్‌ లో కోనుగోలు చేసిన టికెట్లను మామూలు టికెట్లుగా మార్చుకునేందుకు కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, ఏసీఏ-వీడీసీఏ ‘బి’ గ్రౌండ్‌లో కేంద్రాల వద్ద ఆన్ లైన్ టికెట్లను మాములు టికెట్లుగా మార్చుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే టికెట్ల ధరలు మాత్రం క్రికెట్  ఫ్యాన్స్ ను తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ప్రారంభ టికెట్‌ ధర రూ.1,000గా నిర్ణయించడంతో చాలా మంది ఆలోచనలో పడుతున్నారు. గతంలో వైజాగ్‌లో టీ 20, ఇంగ్లాండ్‌తో టెస్టుతో పాటు మరికొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏసీఏ సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంతో బీసీసీఐ ఈ మ్యాచ్‌లను కేటాయించింది. మొత్తంగా నేటి నుంచి టికెట్ల విక్రయం ప్రారంభం కావడంతో దక్కించుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Show comments