Virat Kohli: కోహ్లీ ముందు అందరూ జూజూబీ.. నిజం ఒప్పుకున్న బాబర్ ఆజం!

ప్రస్తుత క్రికెట్​లో గ్రేట్ బ్యాటర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా విరాట్ ముందు అందరూ జూజూబీ అంటున్నాడు. అతడు ఇంకేం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత క్రికెట్​లో గ్రేట్ బ్యాటర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా విరాట్ ముందు అందరూ జూజూబీ అంటున్నాడు. అతడు ఇంకేం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్​లో బెస్ట్ బ్యాట్స్​మన్ ఎవరనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అతడు బెస్ట్ అంటే అతడు బెస్ట్ అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు, అనలిస్టులు కొంతమంది పేర్లు చెబుతుంటారు. అయితే రికార్డులు, ప్రెజర్ సిచ్యువేషన్స్​లో ఆడటం, కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం, ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే గత తరంలో టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ బెస్ట్​గా నిలిచాడు. బ్రేక్ చేయలేని ఎన్నో రికార్డులు అతడి పేరు మీద ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ వారసుడిగా ఈ జనరేషన్​లో బెస్ట్ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. 15 ఏళ్లుగా అలుపెరుగని యోధుడిలా బ్యాట్​తో విజృంభిస్తూ టన్నుల కొద్దీ పరుగులు చేశాడతను. అలాంటోడితో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఆ దేశ ఫ్యాన్స్ పోలుస్తుంటారు. బాబర్ బెస్ట్ అంటూ చెత్త డిస్కషన్స్ పెడుతుంటారు.

బాబర్​ను మించినోడు లేడు.. అతడి ముందు కోహ్లీ వేస్ట్ అంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు ట్రోలింగ్​ చేశారు. అప్పుడు విరాట్ రికార్డులు, సెంచరీలతో భారత అభిమానులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే బాబర్ అసలు నిజం ఒప్పుకున్నాడు. ప్రపంచ క్రికెట్​లో కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్​మన్ అని.. అతడ్ని మించినోడు లేడన్నాడు. విరాట్ ముందు అందరూ జూజూబీ అని తెలిపాడు. ఇంగ్లండ్​, ఐర్లాండ్ టూర్​కు వెళ్లే ముందు నిర్వహించిన ప్రెస్ మీట్​లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పాటు ఇంగ్లండ్ టీ20 సిరీస్, టీ20 వరల్డ్ కప్ గురించి కూడా ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ క్లాస్ ప్లేయర్ అని.. ప్రస్తుత క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాళ్లలో అతడు ఒకడని బాబర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. టీ20 వరల్డ్ కప్​లో విరాట్ కోసం ఏదైనా స్పెషల్ ప్లాన్ వేస్తున్నారా? అని ఆజంకు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. అవసరమైతే భారత టీమ్ మొత్తం కోసం వ్యూహం రచిస్తామని, ఏ ఒక్క ప్లేయర్ కోసం స్పెషల్ ప్లాన్ వేయబోమని స్పష్టం చేశాడు. ఒక్క ఆటగాడి కోసం ప్లాన్స్ ఉండవని, ప్రత్యర్థి జట్టులోని 11 మందిని టార్గెట్ చేసుకొని వ్యూహాలు రచిస్తేనే సత్ఫలితాలు ఉంటాయన్నాడు. అయితే భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​కు ఆతిథ్యం ఇవ్వనున్న న్యూయార్క్​లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమన్నాడు. అక్కడి సిచ్యువేషన్స్​కు తగ్గట్లు వ్యూహాలు రచిస్తామని.. కోహ్లీ కోసం కూడా ప్లానింగ్ చేస్తామన్నాడు బాబర్. కాగా, పాక్ కెప్టెన్ కామెంట్స్ విన్న నెటిజన్స్ తన కంటే కోహ్లీనే గొప్ప అని అతడు ఒప్పుకున్నాడని.. ఇక నో మోర్ డిస్కషన్స్ అని అంటున్నారు.

Show comments