Nidhan
Team India Victory Parade: టీమిండియా విక్టరీ పరేడ్ వైభవంగా జరుగుతోంది. భారత జట్టు వెళ్తున్న బస్సుకు అభిమానులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అయితే పరేడ్‌లో హైలైట్ సీన్ అంటే రోకో జోడీ బాండింగ్ అనే చెప్పాలి.
Team India Victory Parade: టీమిండియా విక్టరీ పరేడ్ వైభవంగా జరుగుతోంది. భారత జట్టు వెళ్తున్న బస్సుకు అభిమానులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అయితే పరేడ్‌లో హైలైట్ సీన్ అంటే రోకో జోడీ బాండింగ్ అనే చెప్పాలి.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేనకు ఊహకందని రెస్పాన్స్ లభిస్తోంది. తొలుత ప్రధాని నరేంద్ర మోడీని కలసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ముంబైకి బయల్దేరిన భారత జట్టును ఫ్యాన్స్ తమ అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి అడుగడుగునా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. వాంఖడే స్టేడియానికి చేరుకునే ముందు నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో వేలాది మంది పాల్గొన్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ఫ్యాన్స్ కోలాహలంతో ముంబై వీధులు, రోడ్లు కిక్కిరిసిపోయాయి. భారత జట్టు బస్సు వెళ్లే మార్గంలో చీమ దూరడానికి కూడా సందు లేనంతగా ట్రాఫిక్ ఏర్పడింది. కప్పు చేతబట్టిన రోహిత్ సేనను కళ్లారా చూసి సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు.
ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో స్వాగతం లభించడంతో టీమిండియా ప్లేయర్లు కూడా ఎమోషనల్ అయ్యారు. కొంతమంది ఆటగాళ్లైతే ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అభిమానుల కళ్లలో ఆనందాన్ని చూసి వాళ్లు కూడా ఏడ్చేశారు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే పరేడ్ జరిగినంత సేపు ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. ఇండియా.. ఇండియా అంటూ అరిచాడు. అలాగే ఓ మూమెంట్లో వరల్డ్ కప్ చేతబట్టి నిలుచున్నాడు. కానీ సెలబ్రేట్ చేయకుండా కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచాడు. అతడు వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కలసి కప్పును పైకి లేపాడు. సాధించామంటూ గట్టిగా అరిచాడు కింగ్.
కోహ్లీ-రోహిత్ కలసి ఒకేసారి వరల్డ్ కప్ ట్రోఫీని పైకి ఎత్తడం, ఇద్దరూ కలసి ఆ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం విక్టరీ పరేడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇది చూసిన నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్కు ఇది నిదర్శనమని అంటున్నారు. రోకో జోడీ మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలని చెబుతున్నారు. ఇక, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే కప్పును క్లీన్ చేశాడు రోహిత్. దాని మీద పడిన మరకల్ని తుడిచాడు. ఆ తర్వాత కప్పును హార్దిక్ పాండ్యా చేతికి ఇచ్చాడు. ఐపీఎల్ టైమ్‌లో అతడి మీద ట్రోలింగ్ జరిగింది. కాబట్టి అదే ముంబై గడ్డ మీద పాండ్యాను హీరో చేయాలనే ఉద్దేశంతో అతడి చేతికి కప్పు అందించి వెనుక నుంచి టీమ్‌ను లీడ్ చేశాడు హిట్‌మ్యాన్.
Virat Kohli asked Rajeev Shukla to bring Rohit Sharma in front and let him hold the trophy. 🥹❤️ pic.twitter.com/cLSmxtHOcT
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024