Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో నడుస్తోంది. వరుసగా విఫలమవుతూ విమర్శలపాలవుతున్నాడు కింగ్.
టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో నడుస్తోంది. వరుసగా విఫలమవుతూ విమర్శలపాలవుతున్నాడు కింగ్.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఆడిన 3 మ్యాచుల్లోనూ నెగ్గి గ్రూప్ టాపర్‌గా నిలిచింది రోహిత్ సేన. మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆ తర్వాత మ్యాచుల్లో పాకిస్థాన్, యూఎస్‌ను ఓడించింది. వరుస విజయాలతో సూపర్-8కు అఫీషియల్‌గా క్వాలిఫై అయింది. కెనడాతో జరిగే ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వాలని చూస్తోంది. అయితే టీమిండియాలో అంతా బాగానే ఉన్నా ఒక విషయం మాత్రం బిగ్ వర్రీగా మారింది. అదే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్. ఎప్పుడూ మూడో నంబర్లో ఆడే కింగ్‌ను మెగా టోర్నీలో ఓపెనర్‌గా దించుతున్నారు. అయితే ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆ పొజిషన్లో వచ్చి దారుణంగా విఫలమయ్యాడతను.
మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు విరాట్. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దాయాది పాకిస్థాన్ మీద 3 బంతుల్లో 4 పరుగులు చేసి క్రీజును వీడాడు. పసికూన అమెరికా పైన అయినా ఫామ్‌ను అందుకుంటాడని అనుకుంటే ఆ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. క్రీజులో సెటిల్ అవడంపై ఫోకస్ చేయకుండా గుడ్డిగా షాట్లు కొట్టడం, తన న్యాచురల్ గేమ్‌ను వదిలి ధనాధన్ శైలిలో ఆడేందుకు ప్రయత్నిస్తుండటమే కోహ్లీ వైఫల్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. విరాట్ బ్యాటింగ్ తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో అతడికి అండగా నిలిచాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్. కింగ్ అసలు రూపాన్ని మున్ముందు చూస్తారని అన్నాడు.
‘విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. అతడ్ని లైట్‌గా తీసుకోవడానికి లేదు. మెగా టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ కోహ్లీ ఊపందుకుంటాడు. తన అసలు రూపం ఏంటో మున్ముందు బయటపడుతుంది. తన బ్యాటింగ్ గొప్పతనం అతడు తప్పక చూపిస్తాడు. వరల్డ్ కప్ మొదలవక ముందు విరాట్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలుస్తాడని నేను ప్రిడిక్షన్ చెప్పా. అతడు మొదటి దశలో అంతగా రాణించలేదు. అయినా నేను నా మాట మీద నిలబడుతున్నా. కచ్చితంగా రాబోయే మ్యాచుల్లో అతడు పరుగుల వర్షం కురిపిస్తాడు’ అని జాఫర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీ అభిమానులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బిగ్ టోర్నమెంట్స్‌లో ఎలా ఆడాలో అతడికి తెలుసునని.. ఇంకా ఏమీ అయిపోలేదని, అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెబుతున్నారు. మరి.. కోహ్లీ స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Wasim Jaffer said “Dont write off Virat Kohli, as the tournament will get to its business end, he will show his true colors & he will show his greatness. I had picked Virat Kohli as the highest run scorer & I will stick to him”. [Wasim Jaffer YT] pic.twitter.com/YTfqEkkAPX
— Johns. (@CricCrazyJohns) June 14, 2024