IND vs ENG: విఫలం అవుతున్న ప్లేయర్ కు గాయం.. ఇంగ్లాండ్ సిరీస్ కు దూరం!

వరుసగా విఫలం అవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కు గాయమైనట్లు సమాచారం. దీంతో అతడు ఇంగ్లాండ్ తో జరిగే చివరి మూడు టెస్ట్ లకు దూరం కానున్నాడని తెలుస్తోంది.

వరుసగా విఫలం అవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కు గాయమైనట్లు సమాచారం. దీంతో అతడు ఇంగ్లాండ్ తో జరిగే చివరి మూడు టెస్ట్ లకు దూరం కానున్నాడని తెలుస్తోంది.

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. కీలకమైన మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా జరగబోతోంది. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గైర్హాజరీతో టీమిండియా సతమతం అవుతుంటే.. తాజాగా మరో పిడుగులాంటి వార్త తెలిసింది. స్టార్ ప్లేయర్ గాయం కారణంగా చివరి మూడు టెస్ట్ లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇది భారత జట్టుకు పెద్ద దెబ్బే.

ఇంగ్లాండ్ పై రెండో టెస్ట్ లో గెలిచి జోష్ లో ఉన్న టీమిండియాకు గాయాలు షాకిస్తున్నాయి. ఓవైపు వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అతడితో పాటుగా గాయం కారణంగా టీమ్ కు అందుబాటులో లేడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. అయితే గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మూడో టెస్ట్ కు ఎంట్రీ ఇస్తాడన్న గుడ్ న్యూస్ ని వినే లోపే మరో బ్యాడ్ న్యూస్ వినపడింది. భారత స్టార్ ప్లేయర్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడు వెన్నునొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడుతున్న సమాచారం. దీంతో ఇంగ్లాండ్ తో జరగబోయే మూడు టెస్టులకు దూరం కానున్నాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ.. క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. శ్రేయస్ అయ్యర్ గత కొన్ని మ్యాచ్ ల నుంచి వరుసగా విఫలం అవుతూ వస్తున్నాడు. దీంతో వచ్చే మ్యాచ్ ల్లో అయినా సత్తాచాటి తానేంటో నిరూపించుకుందాం అన్న టైమ్ లోనే ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. ఒకవేళ అతడు మూడో టెస్ట్ వరకు ఫిట్ కాకపోతే.. శ్రేయస్ ప్లేస్ లో మరో యంగ్ ప్లేయర్ కు మంచి అవకాశం దక్కుతుంది. ఈ అవకాశం సర్ఫరాజ్ ఖాన్ కే ఎక్కువగా ఉంది. పైగా అతడు జట్టుతోనే ఉన్నాడు. రెండో టెస్ట్ లో గిల్ కు గాయమైనప్పుడు ఫీల్డింగ్ చేశాడు సర్ఫరాజ్. మరి శ్రేయస్ అయ్యర్ దూరం కావడం టీమిండియాకు నష్టమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Heinrich Klaasen: సన్ రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. కేవలం 30 బంతుల్లోనే

Show comments