ఇండియా-పాక్ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్. ఆసియా కప్ లో భాగంగా.. సెప్టెంబర్ 2న దాయాది దేశంతో టీమిండియా తలపడబోతోంది. ఇక పాక్ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో పసికూన నేపాల్ ను 238 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో ఇదే ఊపును టీమిండియాపై కూడా కొనసాగిద్దాం అనుకున్న పాక్ కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ గాయం కారణంగా ఇండియాతో మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగలనుంది. నేపాల్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ ఇబ్బంది పడ్డాడు. పాత గాయం మళ్లీ తిరగబెట్టడంతో.. ఫిజియో సలహాతో గ్రౌండ్ ను వీడాడు షాహీన్ అఫ్రిదీ. ఈ మ్యాచ్ లో మోకాలి నొప్పితో షాహీన్ ఇబ్బంది పడ్డాడు. అదే విధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో.. అతడు ఇబ్బందికి గురై ఫీల్డ్ ను వీడాడు. కాగా.. నేపాల్ తో మ్యాచ్ లో కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి.. 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఒకవేళ పాత గాయం తిరగబెడితే.. ఇండియాతో మ్యాచ్ తో పాటుగా టోర్నీ మెుత్తానికే షాహీన్ షా అఫ్రిదీ దూరం అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పాక్ పని ఇక అంతే సంగతి అంటున్నారు క్రీడా పండితులు. ఎందుంటే పాక్ బౌలింగ్ దళానికి వెన్నముకగా షాహీన్ నిలుస్తూ వస్తున్నాడు. మరి అలాంటి బౌలర్ టోర్నీకి దూరం అయితే.. పాక్ బౌలింగ్ దళం బలహీన పడుతుంది. అయితే టీమిండియాతో మ్యాచ్ కు సమయం ఉండటంతో.. అతడు కోలుకుని తిరిగి వస్తాడని ఆశిస్తున్నారు పాక్ అభిమానులు.
Shaheen Afridi felt some discomfort and left the field 🤐#PAKvsNEP #AsiaCup2023 pic.twitter.com/U7NI9Dt6kR
— Hamxa 🏏🇵🇰 (@hamxashahbax21) August 30, 2023