వీడియో: ఎవడ్రా.. రోహిత్‌కు వయసైందని చెప్పింది? ఇది చూడండి

Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వయసు గురించి, ఫిట్‌నెస్‌పై చాలా చాలా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు అతను చేసిన ఫీల్డింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వయసు గురించి, ఫిట్‌నెస్‌పై చాలా చాలా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు అతను చేసిన ఫీల్డింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మ్యాచ్‌పై పట్టుబిగిస్తూ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన భారత్‌.. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకే ఆలౌట్‌ చేశారు భారత బౌలర్లు. బంగ్లా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో టీమిండియా బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌ నాలుగో బంతిని.. బంగ్లా బ్యాటర్‌ మెహదీ హసన్‌ కవర్స్‌లోకి షాట్‌ ఆడాడు. కానీ ఆ బాల్‌ను సర్కిల్‌ లోపలే రోహిత్‌ సూపర్‌ ఫీల్డింగ్‌తో డైవ్‌ చేస్తూ ఆపేశాడు.

రోహిత్‌ ఫీల్డింగ్‌కు సిరాజ్‌, అశ్విన్‌ ఫిదా అయిపోయారు. రోహిత్‌ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. కెప్టెన్‌ ఎఫర్ట్స్‌ను అభినందించారు. రోహిత్‌ డైవ్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ వీడియో చూసిన రోహిత్‌ శర్మ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. రోహిత్‌ శర్మ వయసు అయిపోయిందని కామెంట్స్ చేస్తున్న వారు ఈ వీడియో చూడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. 37 ఏళ్ల వయసులో, 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇలాంటి ఫీల్డింగ్‌ చేస్తూ.. సూపర్‌ ఫిట్‌గా ఉన్న హిట్‌మ్యాన్‌ చాలా కాలం క్రికెట్‌ ఆడతాడని అంటున్నారు. చెన్నైలో సాధారణంగా బాగా వేడిగా ఉంటుంది. అందులోనూ మధ్యాహ్న సమయంలో రోహిత్‌ శర్మ అలాంటి ఫీల్డింగ్‌ చేయడం విశేషం.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత.. రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్ట్‌, వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతానని ప్రకటించాడు. అయితే.. రోహిత్‌ వయసు దృష్ట్యా అతను ఎక్కువ కాలం ఇందులో కొనసాగలేడని కొన్ని కామెంట్స్‌ వినిపించాయి. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు రోహిత్‌ శర్మ వన్డేలో కొనసాగుతాడా? లేడా అన్న విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కానీ, ఇప్పుడు బంగ్లాపై ఫీల్డింగ్‌ చూస్తే మాత్రం రోహిత్‌ శర్మ కచ్చితంగా 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడేలా ఉన్నాడంటూ క్రికెట్‌ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ఎఫర్ట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments