Rohit Sharma: రోహిత్ విధ్వంసానికి ఇదే నిదర్శనం.. అంకెలు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన చివరి టీ20లో తన విశ్వరూపం చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు ఆడిన విధానం చూస్తే.. దిమ్మతిరగాల్సిందే. రోహిత్ విధ్వంసం ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం పదండి.

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన చివరి టీ20లో తన విశ్వరూపం చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు ఆడిన విధానం చూస్తే.. దిమ్మతిరగాల్సిందే. రోహిత్ విధ్వంసం ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం పదండి.

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరిదైన నామమాత్రపు మ్యాచ్ లో ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించారు. ఇరు జట్ల ఆటగాళ్లు తమ బ్యాట్లకు పని చెప్పడంతో.. భారీ స్కోర్లు నమోదైయ్యాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ వరకు వెళ్లింది ఈ మ్యాచ్. కానీ ఆ ఓవర్ కూడా టై కావడంతో, మరో సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇక ఈ ఓవర్లో టీమిండియా విజయం సాధించింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో తన విశ్వరూపం చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు ఆడిన విధానం చూస్తే.. దిమ్మతిరగాల్సిందే. తొలి రెండు మ్యాచ్ లో డకౌట్ అయిన కసిని ఈ మ్యాచ్ లో తీర్చుకున్నాడు. రోహిత్ విధ్వంసం ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం పదండి.

69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులతో ఆఫ్గానిస్తాన్ తో జరిగిన చివరి టీ20లో అజేయంగా నిలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ దశలో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ కు చేరుతుండటంతో.. 4.3 ఓవర్లలో కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ కు ఈ మ్యాచ్ లో పరాజయం తప్పదని బహుశా అందరూ అనుకుని ఉంటారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఊహించని రీతిలో చెలరేగాడు హిట్ మ్యాన్ రోహిత్. ఒంటరిగా దండయాత్ర చేస్తూ.. ఆఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒక దశలో టీమిండియా 4 వికెట్లకు 11.3 ఓవర్లలో 68 పరుగులు చేసింది.

ఆ సమయంలో రోహిత్ 34 బంతుల్లో 28 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. వికెట్లు పడుతున్నాయని బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ఆడాడు. ఇక ఇక్కడి నుంచి గేర్ మార్చి.. ఊచకోత మెుదలుపెట్టాడు. తొలుత 34 బంతుల్లో 28 రన్స్ మాత్రమే చేసిన హిట్ మ్యాన్.. ఆ తర్వాత ఆడిన 35 బాల్స్ లో ఏకంగా 93 పరుగులు పిండుకున్నాడు. మరో వైపు రింకూ సింగ్ సైతం తనదైన శైలిలో చెలరేగాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రింకూ సింగ్, రోహిత్ శర్మలు పోటీపడి మరీ ఆఫ్గాన్ బౌలర్లను చితకొట్టారు. వీరిద్దరు కేవలం 5 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు అంటే.. ఏ రేంజ్ లో దంచికొట్టారు అర్దం చేసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా రోహిత్ సెకండాఫ్ లో చెలరేగిన విధానం చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. దీంతో ఆఫ్గాన్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫస్ట్ లో వికెట్లు పడుతున్నాయని నిదానంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్. ఆ తర్వాత ఓవర్లు దగ్గరపడుతుండటంతో.. తనలో ఉన్న హిట్ మ్యాన్ ను ప్రత్యర్థికి పరిచయం చేశాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్ లో సెకండాఫ్ లో 265 స్ట్రైక్ రేట్ తో దంచికొట్టాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ శర్మ సాగించిన విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments