T20 World Cup: తొలి హ్యాట్రిక్‌ నమోదు! సాధించిన బౌలర్‌ ఎవరో తెలిస్తే ఉలిక్కిపడతారు!

T20 World Cup: తొలి హ్యాట్రిక్‌ నమోదు! సాధించిన బౌలర్‌ ఎవరో తెలిస్తే ఉలిక్కిపడతారు!

Pat Cummins, Hat Trick, AUS vs BAN, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి హ్యాట్రిక్‌ నమోదు అయింది. అయితే.. ఈ హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌ ఎవరో తెలిస్తే ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉలిక్కి పడతారు. మరి ఆ బౌలర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Pat Cummins, Hat Trick, AUS vs BAN, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి హ్యాట్రిక్‌ నమోదు అయింది. అయితే.. ఈ హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌ ఎవరో తెలిస్తే ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉలిక్కి పడతారు. మరి ఆ బౌలర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

కీలకమైన సూపర్‌ 8 స్టేజ్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే.. తాజాగా ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో తొలి హ్యాట్రిక్‌ నమోదు అయింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ హ్యాట్రిక్‌ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ హ్యాట్రిక్‌ సాధించాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఐదో బంతికి మహమ్మదుల్లాను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన కమిన్స్‌.. అదే ఓవర్‌ చివరి బాల్‌కు మెహదీ హసన్‌ను అవుట్‌ చేశాడు హసన్‌ ఆడమ్‌ జంపాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇలా రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన కమిన్స్‌.. తిరిగి 20వ ఓవర్‌ వేస్తూ.. తొలి బంతికే మరో వికెట్‌ తీసి.. మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి.. ఈ హ్యాట్రిక్‌ సాధించాడు.

టీ20 వరల్డ్‌ కప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌గా ప్యాట్‌ కమిన్స్‌ నిలిచాడు. కమిన్స్‌ కంటే ముందు టీ20 వరల్డ్‌ కప్‌ 2007లో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ హ్యాట్రిక్‌ సాధించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే మొట్టమొదటి హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా బ్రెట్‌లీ నిలిచాడు. ఆ తర్వాత మరికొంతమంది బౌలర్లు టీ20 వరల్డ్‌ కప్స్‌లో హ్యాట్రిక్‌లు సాధించారు. అయితే.. ప్యాట్‌ కమిన్స్‌ ఈ రేంజ్‌లో చెలరేగుతుంటే.. టీమిండియా ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. సూపర్‌ 8లో భాగంగా ఈ నెల 24న టీమిండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ఆడనుంది. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా గెలిస్తే.. తిరిగి ఫైనల్‌లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడే అవకాశం ఉంది. అందుకే కమిన్స్‌ ఫామ్‌ చూసి భారత క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్‌ షాంటో 41, తౌహిద్‌ 40 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అవ్వడంతో బంగ్లా తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, జంపా 2, మిచెల్‌ స్టార్క్‌, స్టోయినీస్‌, మ్యాక్స్‌వెల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఇక 141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 11.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఈ టైమ్‌లో వర్షం వచ్చి మ్యాచ్‌ ఆగిపోవడంతో.. డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు అంపైర్లు. వర్షం వచ్చే సమాయానికి లక్ష్యం దిశగా సాగుతున్న ఆసీస్‌ 28 పరుగులు ముందు ఉండటంతో.. ఆసీస్‌ 28 పరుగుల తేడాతో గెలిచినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌ 35 బంతుల్లో 53, ట్రావిస్‌ 31 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ సాధించిన హ్యాట్రిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments