‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్లో ఒక నానుడి ఉంది. ఇది బాగా పాపులర్. జెంటిల్మన్ గేమ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో ఫీల్డింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఒక్క క్యాచ్ లేదా ఒక్క రనౌట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో భారత బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోని రనౌట్ అయ్యాడు. ఒకవేళ ధోని ఔట్ కాకపోయుంటే ఆ మ్యాచ్‌లో టీమిండియానే గెలిచేది. ఆ ఒక్క రనౌట్ కారణంగా టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించింది. చెప్పుకుంటూ పోతే క్రికెట్లో బెస్ట్ ఫీల్డింగ్ అనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఒకప్పుడు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లే ఫీల్డింగ్ మెరుగ్గా చేసేవి. కానీ రానురాను అన్ని టీమ్స్ దీనిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. తమ ఫీల్డింగ్‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఫీల్డింగ్ కోసం ప్రత్యేక కోచ్‌తో పాటు ట్రెయినింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. వీటి ఫలితాలు కూడా క్రమంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌కు మధ్య నాలుగు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ 79 రన్స్ తేడాతో గెలుపొందింది. 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 226 రన్స్ చేసింది. ఆ టీమ్‌లో లియామ్ లివింగ్స్టన్ (95 నాటౌట్), సామ్ కర్రన్ (42), మొయీన్ అలీ (33) రాణించారు.
ముఖ్యంగా లివింగ్స్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌కు భారీ స్కోరును అందించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 26.5 ఓవర్లలో 147 రన్స్‌కు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్ (57), విల్ యంగ్ (33) మాత్రమే రాణించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో మిడిల్ స్టంప్‌పై పడిన బంతిని ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఆన్ సైడ్‌లోకి ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కవర్స్‌లోకి వెళ్లింది. అక్కడే కాచుకొని ఉన్న మిచెల్ సాంట్నర్ గాల్లోకి దూకి తన ఎడమ చేతితో అద్భుతంగా క్యాచ్‌ను పట్టాడు. సాంట్నర్ క్యాచ్‌ను బెయిర్ స్టో నమ్మలేకపోయాడు. సాంట్నర్ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఎవరికి నష్టం?
Mitchell Santner with a stunner…!!!
Trent Boult picks up a wicket on return. pic.twitter.com/OoHDr3xdhk
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2023