IND vs SL: రోహిత్‌ చేసిన పనికి ఔట్‌ కాకుండానే వెళ్లిపోయిన బ్యాటర్‌!

Janith Liyanage, Rohit Sharma, IND vs SL: భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోహిత్‌ కారణంగా ఓ బ్యాటర్‌ అవుట్‌ కాకుండానే పెవిలియన్‌కు చేరాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Janith Liyanage, Rohit Sharma, IND vs SL: భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోహిత్‌ కారణంగా ఓ బ్యాటర్‌ అవుట్‌ కాకుండానే పెవిలియన్‌కు చేరాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు భారత స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ మూడో బంతికి అవిష్క పెర్నాండోను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు లంక పనిపట్టారు. వరుసగా వికెట్లు తీస్తూ.. ఎక్కడా కూడా లంకకు మంచి పార్ట్నర్‌షిప్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాటర్‌ జనిత్‌ లియానగే అవుట్‌ కాకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ పెట్టిన ఒత్తిడి వల్లే జనిత్‌ లియానగే క్రీజ్‌ వీడాడు. జనిత్‌ దగ్గరికి వెళ్లి.. నువ్వు అవుట్‌ వెళ్లిపోవాల్సిందే అంటూ.. రోహిత్‌ ఏం చెప్పలేదు. కానీ, అవుట్‌ కోసం చాలా కాన్ఫిడెన్స్‌గా అప్పీల్‌.. జనిత్‌పై తీవ్ర ప్రభావం చూపింది. రోహిత్‌ అంత నమ్మకంగా అప్పీల్‌ చేస్తున్నాడు అంటే.. అవుట్‌ అయ్యే ఉంటుందమో అని జనిత్‌ పెవిలియన్‌ వైపు నడిచాడు. అయితే.. అప్పటికీ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించలేదు. కానీ, జనిత్‌ వెళ్లిపోతుండటంతో అంపైర్‌ కూడా అవుట్‌ ఇచ్చేశాడు. కానీ, రిప్లేలో చూస్తే.. బాల్‌ బ్యాట్‌కు తాకలేదని తెలిసింది.

అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 35వ ఓవర్‌లో ఈ ఇన్సిడెంట్‌ చోటు చేసుకుంది. ఆ ఓవర్‌ మూడో బంతిని అక్షర్‌ ఫ్లైటెడ్‌ డెలవరీగా వేశాడు. ఆ బాల్‌ను జనిత్‌ భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బాల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ పక్క నుంచి వెళ్లింది. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ చేతికి తాకుతూ.. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ చేతుల్లో పడింది. దాంతో.. రోహిత్‌ క్యాచ్‌ అవుట్‌ కోపం అప్పీల్‌ చేశాడు. బాల్‌ కీపర్‌ చేతులకు తగిలి.. రోహిత్‌ చేతుల్లో పడిందనే విషయం గమనించని బ్యాటర్‌.. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ చేతుల్లో పడిండి కాబట్టి.. ఎడ్జ్‌ తీసుకునే ఉంటుందని భ్రమ పట్టాడు. పైగా అదే సమయానికి అతని బ్యాట్‌ కూడా క్రీజ్‌ను హిట్‌ చేయడంతో బాల్‌ తగిలిందని అనుకున్నాడు. దాంతో.. అంపైర్‌ అవుట్‌ ఇవ్వకపోయినా.. తాను నిజాయితీ వెళ్లిపోవాలని వెళ్లిపోయాడు. కానీ, రీప్లేలో తాను ఔట్‌ కాదని తెలుసుకుని షాక్‌ అయ్యాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments