IND vs PAK: టీమిండియాను ఆదుకున్న ఇషాన్‌! జట్టు మొత్తం నిలబడి..

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య హోరాహోరీ మ్యాచ్‌ సాగుతోంది. రెండు బెస్ట్‌ టీమ్స్‌ తలపడితే.. మ్యాచ్‌ ఎంత టఫ్‌గా ఉంటుందో చూపిస్తూ ఆడుతున్నాయి ఇండియా-పాకిస్థాన్‌. మ్యాచ్‌ ఆరంభం అయిన తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలతో పాటు టాపార్డర్‌ మొత్తాన్ని వెంటవెంటనే అవుట్‌ చేసి పాకిస్థాన్‌ పైచేయి సాధిస్తే.. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌-హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను మళ్లీ టీమిండియా వైపు తిప్పాడు. అప్పటి వరకు చెలరేగిన పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అద్భుత భాగస్వామ్యంతో టీమిండియాను ఆదుకున్నారు.

మరీ ముఖ్యంగా ఇషాన్‌ కిషన్‌ గురించి మాట్లాడుకోవాలి. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(11), విరాట్‌ కోహ్లీ(4) లాంటి హేమాహేమీలతో పాటు యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌.. నిప్పులు చెరుగుతున్న పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బ్యాటింగ్‌కు వచ్చి రావడంతోనే తన సహజ శైలిలో పాక్‌ బౌలర్లపై ఎటాకింగ్‌ ప్లే అస్త్రాన్ని ప్రయోగించాడు. అది అద్భుతంగా సక్సెస్‌ అయింది. దీంతో ఇషాన్‌ మరింత రెచ్చిపోయాడు.

శుబ్‌మన్‌ గిల్‌ అవుటైన తర్వాత హార్దిక్‌ పాండ్యాతో జత కలిసి ఇషాన్‌ కిషన్‌.. అద్భుతంగా ఆడుతూ.. టీమిండియాను మంచి పొజిషన్‌లోకి తీసుకొచ్చాడు. పాండ్యాతో కలిసి ఇషాన్‌ ఐదో వికెట్‌కు 138 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్‌ 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 82 పరుగులు చేసి.. హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. భారత క్రికెట్‌ అభిమానులంతా ఇషాన్‌ కచ్చితంగా సెంచరీ చేస్తాడని భావించారు. కానీ, ఇన్నింగ్స్‌ 38వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అది మిస్‌ టైమ్‌ అవ్వడంతో క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. అయితే.. కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో జట్టులోకి వచ్చిన ఇషాన్‌.. ఈ ఇన్నింగ్స్‌తో తన ప్లేస్‌ పర్మినెంట్‌ చేసుకున్నాడు. అయితే.. ఇషాన్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నా.. అతను ఆడిన ఇన్నింగ్స్‌ సెంచరీ కంటే ఎక్కువే అంటూ భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి కిషన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: అచ్చం ప్రాక్టీస్‌లోలానే రోహిత్ అవుట్! వీడియో వైరల్

Show comments