IND vs SL: నేడే శ్రీలంకతో తొలి టీ20! ఇండియన్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

IND vs SL: నేడే శ్రీలంకతో తొలి టీ20! ఇండియన్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

IND vs SL, India's Playing 11: శ్రీలంకతో నేడు భారత జట్టు తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs SL, India's Playing 11: శ్రీలంకతో నేడు భారత జట్టు తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత టీమిండియా ఒక పటిష్టమైన టీమ్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. వరల్డ్‌ కప్‌ విజయంతో మంచి జోష్‌ మీదున్న భారత జట్టు.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం కొన్ని రోజుల ముందుగానే టీమిండియా లంక గడ్డపై అడుగుపెట్టింది. కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరగబోతున్న తొలి టీ20 సిరీస్‌ కావడంతో ఈ సిరీస్‌పై భారత క్రికెట్‌ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే గంభీర్‌, సూర్య సైతం.. తమ తొలి సిరీస్‌లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు.

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ తర్వాత.. టీ20 కెప్టెన్‌గా సూర్యను నియమించిన విషయం తెలిసిందే. పైగా స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లేకుండా భారత జట్టు ఒక పూర్తి స్థాయి ఫ్యూచర్‌ టీమ్‌తో ఆడుతోంది. ఇప్పుడు శ్రీలంకతో ఆడే జట్టు.. కొన్ని కాలాల పాటు టీమిండియాను టీ20 క్రికెట్‌లో నడిపించనుంది. వాళ్లిద్దరు లేకుండా కొత్త టీమిండియా ఎలా ఉండుతుందోనని కూడా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత.. గిల్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా జింబాబ్వేపై 4-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. మరి సూర్య ఏం చేస్తుందో చూడాలి.

మరోవైపు శ్రీలంక విషయానికి వస్తే.. ఆ జట్టు కూడా ఈ సిరీస్‌కి ముందే తమ కొత్త టీ20 కెప్టెన్‌ను నియమించింది. చరిత​ అసలంకకు శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శనను కనబర్చింది. గ్రూప్‌ దశలోనే ఇంటి బాట పట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. టీ20 వరల్డ్‌ కప్‌లో వైఫల్యంతో ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రాజీనామా చేయడంతో.. శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్యను కొత్త హెడ్‌ కోచ్‌గా నియమించింది శ్రీలంక క్రికెట్‌ బోర్డు. కొత్త కెప్టెన్‌, కొత్త కోచ్‌ లంకలో నూతనోత్సాహం వచ్చింది. భారత్‌, శ్రీలంక మధ్య తొలి టీ20 ఈ రోజు(శనివారం) 7.30 గంటలకు ప్రారంభం కానుంది. పల్లెకలె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌.

బెంచ్‌: వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే.

Show comments