Somesekhar
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సాధించిన గ్రేట్ రికార్డు ఒకటి టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో బద్దలుకొట్టాడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సాధించిన గ్రేట్ రికార్డు ఒకటి టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో బద్దలుకొట్టాడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్.
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో రికార్డులు అనగానే అందరికి గుర్తుకు వచ్చే ఆటగాళ్ల పేర్లలో ఫస్ట్ ఉంటుంది టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు. తన బ్యాట్ తో టన్నుల కొద్ది పరుగులు సాధించడమే కాకుండా.. వందల కొద్ది రికార్డులు నెలకొల్పాడు మాస్టర్ బ్లాస్టర్. తన పేరిట ఎన్నో ఘనతలను క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది సచిన్ రికార్డులు బద్దలవుతూ వస్తున్నాయి. టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ ఎక్కువగా సచిన్ ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా కూడా సచిన్ సాధించిన గ్రేట్ రికార్డు ఒకటి బ్రేక్ అయ్యింది. కానీ ఈసారి మాస్టర్ రికార్డు బద్దలు కొట్టింది కోహ్లీ కాదు. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్. మరి జో రూట్ బద్దలు కొట్టిన సచిన్ ఆల్ టైమ్ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జో రూట్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సొగసైన బ్యాటింగ్ తో పరుగుల వరదపారిస్తూ.. ఇంగ్లాండ్ టీమ్ కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. దీంతో పాటుగా తన పేరిట కొన్ని అరుదైన రికార్డులను కూడా లిఖించుకున్నాడు రూట్. తాజాగా మరో ఘనతను కూడా సాధించాడు ఈ స్టార్ ప్లేయర్. ఈసారి ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు జో రూట్. హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బౌలర్ల ధాటికి 246 రన్స్ కే కుప్పకూలింది. జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 70 పరుగులతో రాణించాడు.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో సచిన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్. ఈ మ్యాచ్ లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత నెలకొల్పాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే? టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు జో రూట్. అతడు ఇప్పటి వరకు 45 ఇన్నింగ్స్ ల్లో 2555 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉండేది. సచిన్ 53 ఇన్నింగ్స్ ల్లో 2535 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ 2348 రన్స్, అలిస్టర్ కుక్ 2431 పరుగులతో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ 1991 రన్స్ చేసి 5వ స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 రన్స్ కే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్, జడేజా తలా 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, బుమ్రాలు తలా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా దుమ్మురేపుతోంది. యశస్వీ జైస్వాల్ అర్ధశతకం సాధించి శతకం వైపు దూసుకెళ్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(27) మరోసారి విఫలం అయ్యాడు. మరి సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Joe Root surpasses Sachin Tendulkar to become the highest run-scorer in India-England Test matches 🔝#INDvsENG #JoeRoot #SachinTendulkar #TestCricket #CricketTwitter pic.twitter.com/WOA0ZRkwU8
— InsideSport (@InsideSportIND) January 25, 2024